Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టెన్షన్‌తో తలపట్టుకున్న నాగార్జున
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున టెన్షన్‌తో తలపట్టుకున్నాడు. దూకుడు సినిమాకు హిట్ టాక్ వచ్చిందనో..? త్వరలో రాబోతున్న తన రాజన్న సినిమా భవిష్యత్ ఏమిటో? అనే విషయంపై మాత్రం కాదు. నాగార్జున టెన్షన్ కు కారణం మరొకటి ఉంది. దాన్ని ఎలా అదిగమిద్దామని తెగ ఆలోచిస్తూ తల నొప్పి తెచ్చుకుంటున్నాడు.
టాలీవుడ్ పోకడను నిశితంగా పరిశీలిస్టే....ఒక్కో సినీ కుటుంబం నుంచి ఒక హీరోకు మాత్రమే స్టార్ ఇమేజ్ లభిస్తోంది. తొలి నాళ్లలో పిరిశ్రమను ఏళిన వారిలో ఎన్.టి. రామారావు, నాగేశ్వర రావు, కృష్ణ కుటుంబాలు ప్రముఖమైనవి. ఆ తర్వాత చిరంజీవి వచ్చారు. వీరి తర్వాత నందమూరి కుటుంబం నుంచి బాలయ్య, అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, కృష్ణ కుటుంబం నుంచి మహేష్ బాబు, చిరంజీవి కుటుంబం నుంచి పవన్ కళ్యాన్ మాత్రమే నిలదొక్కకోగలిగారు. థర్డ్ జనరేషన్ విషయానికొస్తే నందమూరి కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చినా క్లిక్ అయింది జూ.ఎన్టీఆర్ ఒక్కరే. అల్లు అర్జున సంగతి పక్కన పెడితే చిరు కుటుంబం నుంచి స్టార్ అయింది రామ్ చరణ్. అక్కినేని కుటుంబం నుంచి వచ్చి థర్డ్ జనరేషన్ హీరోలంతా ప్లాపయ్యారు. ఇప్పుడిప్పుడే నాగచైతన్య స్టార్ గా ఎదుగుతున్నాడు.
ఇలా ప్రతి జనరేషన్ లో కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే క్లిక్ అవ్వడం నాగ్ ను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే నాగచైనత్య తమ కుటుంబ థర్డ్ జనరేషన్ స్టార్ గా ఎదిగాడు. మరి ఈ నేపథ్యంలో తన చిన్న కుమారుడు అఖిల్ సినిమాల్లోకి తేవాలా? వాద్దా? తెచ్చాక ప్లాపయితే నా పరువు పోతుంది. తేక పోతే వాడు వినేట్లు లేడు. అనే ఆలోచనలతో మన్మధుడి తల బద్దలవుతోంది. మరి భవిష్యత్ లో ఏం జరుగబోతోందో? చూడాలి.