twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న విషయాలే, కానీ మనసును తాకాయి, నాకు కళ్లల్లో నీళ్లొచ్చాయి: నాగార్జున కంటతడి

    "నాకు కళ్లల్లో నీళ్లొచ్చాయి. అవి తుడిచేసుకుని వెనక్కి తిరిగితే అందరి కళ్లళ్లోనూ నీళ్లు కనిపించాయి" అంటూ ఒక మామూలు తండ్రిగా చై, సమంతా పెళ్ళి సమయం లో తన ఫీలింగ్ ఎలా ఉందో చెప్పాడు నాగ్

    |

    అక్కినేని నాగార్జున ఒక సెలబ్రిటీ, పెద్ద హీరో ఇలా ఇంకా చాలానే క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. అయితే ఇవన్నీ మన కోణం నుంచీ అదే నాగ్ సొంతంగా తనని తాను ఒక సామాన్య్డిగానే చూసుకుంటాడు. ఒక భర్తగా ఒక తండ్రిగా నాగ్ ఒక మామూలు మనిషి ఈ విషయాలు తనే చెప్పాడు.

    ఒక తండ్రిగా నాగ చైతన్య పెళ్ళిలో

    ఒక తండ్రిగా నాగ చైతన్య పెళ్ళిలో

    ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక తండ్రిగా నాగ చైతన్య పెళ్ళిలో తానెంత భావోద్వేగానికి గురయ్యాడో, సమంతా తన ఇంటికోడలు గా రావటాన్ని ఎంత సంతోషంగా స్వీకరించాడో చెప్పాడు. పెళ్ళి జరుగుతున్న సమయంలో కళ్ళకి నీళ్ళొచ్చేసాయని, ఆ సమయం లో తనని తాను కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్ అయిపోయాననీ నాగ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే....

    మాటల్లో చెప్పలేను

    మాటల్లో చెప్పలేను

    ‘చైతూ పెళ్లి సమయంలో కలిగిన ఫీలింగ్స్ గురించి మాటల్లో చెప్పలేను. ఎన్నెన్నో భావాలు మనసులోకి వచ్చి వెళ్లాయి. తాళి కట్టే సమయంలో ఒక క్షణం పాటు అంతా బ్లాంక్ గా అనిపించింది. నాకు వాళ్లిద్దరూ చేసుకున్న క్రిస్టియన్ మ్యారేజ్ చాలా బాగా నచ్చింది. ఆ మ్యారేజ్ చేసుకునేటపుడు ఒకరంటే ఒకరికి ఎందుకు ఇష్టమో.. ఎందుకు అవతలి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారో చెప్పాలి.

    ఏదో చిన్న వెలితి ఉంది

    ఏదో చిన్న వెలితి ఉంది

    ఆ సమయంలో ఒకరి గురించి ఒకరు చెప్పుకున్న మాటలు ఎంతో నచ్చాయి. చైతూ ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘నాకు అన్నీ ఉన్నాయి. కానీ ఏదో చిన్న వెలితి ఉంది. అది తను వచ్చి భర్తీ చేసింది' అన్నాడు. ఇక సమంత రకరకాలుగా నవ్వింది. ఏడ్చింది. ఏవేవో ఎమోషన్లు చూపించింది. నాలుగు నిమిషాల పాటు అనర్గళంగా చైతూ గురించి మాట్లాడింది.

    అందరి కళ్లళ్లోనూ నీళ్లు కనిపించాయి

    అందరి కళ్లళ్లోనూ నీళ్లు కనిపించాయి

    ఎంత పెద్ద సమస్య వచ్చినా నవ్వుతూనే ఉంటాడని.. పొద్దున లేచాక చెరగకుండా ఉండే అతడి జుట్టు తనకెంతో ఇష్టమని.. ఇలా ఒకటా రెండా చాలా విషయాలు చెప్పింది. అవన్నీ చిన్న విషయాలే. కానీ మనసును తాకాయి. నాకు కళ్లల్లో నీళ్లొచ్చాయి. అవి తుడిచేసుకుని వెనక్కి తిరిగితే అందరి కళ్లళ్లోనూ నీళ్లు కనిపించాయి'' అని నాగ్ చెప్పాడు.

    English summary
    Talking about one of the hottest topics in Tollywood and Kollywood, the wedding of his elder son Naga Chaitanya with Samantha Prabhu, Nagarjuna shared his feelings at wedding Time
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X