twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూల్ ఫిల్మ్ ( 'గ్రీకువీరుడు' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కామాక్షి మూవీస్‌ పతాకంపై నాగార్జున, నయనతార జంటగా దశరథ్‌ దర్శకత్వంలో శివప్రసాద్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'గ్రీకువీరుడు' . ఈ చిత్రం ఈ రోజు( శుక్రవారం) ప్రేక్షకుల మందుకు రానుంది. సంతోషం వంటి సూపర్ వచ్చిన కాంబినేషన్ రిపీట్ కావటంతో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

    అమెరికాలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తుంటాడు చందు (నాగార్జున). ప్రతి విషయంలోనూ వ్యాపారాత్మకంగా ఆలోచించడం అతని నైజం. అమెరికాలో పుట్టి పెరిగిన చందు తొలిసారి ఇండియాకి రావాల్సొస్తుంది. ఇక్కడ ఓ కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టిన అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇంతకీ ఆ కుటుంబ ఎవరిది? స్వచ్ఛంద సేవా సంస్థలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న సంధ్య (నయనతార)తో చందుకి ఉన్న అనుబంధం ఏమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.

    నాగార్జున ఈ చిత్రం గురించి చెప్తూ....చక్కటి కుటుంబ కథా చిత్రంగా గ్రీకువీరుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, తన నటన సరికొత్త పంథాలో ఉంటుందని తెలిపారు. ఈ వేసవిలో కూల్‌గా సినిమాను చూడొచ్చని, నయనతారతో కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలిపారు.

    దర్శకుడు దశరథ్‌ మాట్లాడుతూ ''బంధాలకు దూరంగా ఉండటం సమస్యకి పరిష్కారం కాదు, ప్రేమతో ఆలోచించాలి.. నమ్మకంతో పరిష్కరించుకోవాలి అనే అంశంతో తెరకెక్కిన కథ ఇది. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది. ఈ కథలో ముగ్గురు చిన్నారుల పాత్రలు కీలకం'' అన్నారు.

    'గ్రీకువీరుడు' లో నాగ్‌ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. నయన్‌ నటన హైలైట్‌. నాగ్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా నటిస్తారు. అయితే ఆ పాత్రకి టైటిల్‌కి సింక్‌ కంటే..నాగ్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ టైటిల్‌ పెట్టారు. ఇది రొమాంటిక్‌ కామెడీ కాదు. ప్రేమకథా చిత్రం కాదు. ప్రేమ, సెంటిమెంట్‌, కామెడీ, అనుబంధాలు అన్ని అంశాల మేలు కలయికతో తీర్చిదిద్దిన నవతరం చిత్రం. ఓ సమస్యని సందేశాత్మకంగా చెబుతూనే వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు. తమిళ్‌లో 'లవ్‌స్టోరి' పేరుతో ఇదే రోజున విడుదలవుతోందని తెలిపారు.

    సంస్థ: కామాక్షి మూవీస్‌
    నటీనటులు: నాగార్జున, నయనతార, మీరాచోప్రా, కె.విశ్వనాథ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, అలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, నాగినీడు, భరత్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు
    ఫోటోగ్రఫీ: అనిల్ బండారి,
    సంగీతం: థమన్,
    ఆర్ట్: ఎస్. రవీందర్,
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
    కో-డైరెక్టర్: కె. సదాశివరావు,
    స్క్రీన్ ప్లే: హరి కృష్ణ,
    అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్,
    కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి,
    నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి,
    కథ-దర్శకత్వం: దశరథ్.
    విడుదల: 03-05-2013.

    English summary
    
 Greeku Veerudu is a romantic famlily oriented movie in which, Nagarjuna playing a role of NRI, who born and brought up in USA. Nayantara playing the female lead. Meera Chopra playing an important role in this movie. Dasaradh is directing this movie and SS Thaman composes music. D Siva Prasad Reddy produces this film on Kamakshi Movies banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X