twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 'గ్రీకువీరుడు' స్టోరీ లైన్ ఏంటి

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున హీరోగా నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం 'గ్రీకు వీరుడు'. నాగ్ సరసన నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ. 'సంతోషం' దర్శకుడు దశరథ్ ఈ చిత్రాన్ని పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా మలిచారు. ఈ వారంలోనే పాటల్ని విడుదల చేస్తారు. వచ్చేనెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    ఈ చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...అబ్బాయి మేడిన్‌ అమెరికా. మనసు మాత్రం పక్కా ఇండియా. పిజ్జా, శాండ్‌విచ్‌ల మధ్య పెరిగినా, మనదైన ఆవకాయ రుచినే ఇష్టపడతాడు. అయితే ప్రేమ, పెళ్లి.. ఈ తతంగాలపై నమ్మకం మాత్రం లేదు. ఎంతమందినైనా ప్రేమించొచ్చు అనేది అతని ఫిలాసఫీ! చూడ్డానికి గ్రీకు వీరుడిలా ఉంటాడు కాబట్టి.. అమ్మాయిలూ అతని ప్రేమలో పడిపోతారు. ఈ అమెరికా అబ్బాయి అభిప్రాయాలకు విరుద్ధభావాలున్న ఓ అమ్మాయి తారసపడింది. అప్పుడు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు

    అలాగే..అమెరికాలోనే పుట్టి పెరిగిన హీరో ఎన్‌ఆర్‌ఐగా మొట్టమొదటిగా భారతదేశానికి వస్తాడు. అతను పొందిన కొన్ని అనుభవాలతో ఈ కథ రూపొందించాం. 'సంతోషం' తర్వాత నాగార్జునతో మళ్లీ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 'గ్రీకువీరుడు'లో నాగార్జున కొత్తగా కనిపిస్తారు. అలాగే కథ కూడా ఆసక్తిదాయకంగా ఉంటుంది'అని అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''నాగార్జున నిజమైన గ్రీకువీరుడిలా కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఆయన వేషధారణ అభిమానులను ఆకట్టుకొంది. దశరథ్‌ ఈ చిత్రాన్ని చక్కగా మలిచారు. సున్నితమైన వినోదం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి''అన్నారు.

    మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, సంగీతం: తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల, సహ నిర్మాత: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాణం: కామాక్షి మూవీస్.

    English summary
    Greekuveerudu is directed by Dasarath who had in the past made the film Santosham with Nagarjuna. Let’s hope this film too is another sweet success for the actor like that film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X