»   » ఎవరి కారణాలు వాళ్ళవి: గెస్ట్ రోల్ లో నాగ్, కమల్

ఎవరి కారణాలు వాళ్ళవి: గెస్ట్ రోల్ లో నాగ్, కమల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్న హీరోల సినిమలకు క్రేజ్ రావాలంటే అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి. అలాంటి మ్యాజిక్, జనాలను ధియోటర్స్ కు లాక్కొచ్చేది స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించటం అని సినీ జనం నమ్ముతుంటారు.

అలాగే ఆ స్టార్స్ కూడా గెస్ట్ గా చేయాలంటే ఆ సినిమాకు సంభందించిన టీమ్ తో స్నేహమో, అసరమో, మరొకటో ఉండాలి. చాలాసార్లు తమ పరిచయాలకోసమే స్టార్స్ గెస్ట్ లుగా చేస్తూంటారు. ఇప్పుడు నాగార్జున, కమల్ హాసన్ రెండు వేరు వేరు సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్‌వర్క్స్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘నిర్మలా కాన్వెంట్'. జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శ్రేయాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. నాగార్జునకు, శ్రీకాంత్ కు మంచి స్నేహం ఉంది. ఆ అనుబంధంతోనే అడగ్గానే కాదన్నారని తెలుస్తోంది.

Nag, Kamal in Guest roles

దర్శకుడు మాట్లాడుతూ....ఓ అందమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తారని, ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయని తెలిపారు. ఎ.ఆర్.రెహమాన్ తనయుడు అమీన్ నేపథ్య గాయకుడుగా పరిచయం అవుతున్నారని, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోందని, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

ఆదిత్యమీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితాచౌదరి, సమీర్, తా.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాలూరి రోషన్, కెమెరా: ఎస్.వి.విశే్వశ్వర్, నిర్మాతలు: అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

Nag, Kamal in Guest roles

అలాగే విశ్వనటుడు కమలహాసన్ తమిళంలో ఇప్పటి వరకూ గెస్ట్ రోల్ లో కనిపించిన దాఖలాలు లేవు. తాజాగా మీన్‌కూళంబుమ్ మణ్‌పాణైయుమ్ చిత్రంలో అతిథి పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు.ఆయన అతిథి పాత్రల్లో నటించడానికి అంగీకరించానికి కారణం... దివంగత మహా నటుడు శివాజీగణేశన్ పై ఆయనకు ఉన్న ప్రేమాభిమానేలే అని చెప్తున్నారు.

శివాజీగణేశన్ మనవడు దుష్యంత్, అభిరామి దుష్యంత్ నిర్మాతలుగా మారి ఈశన్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం మీన్‌కూళంబుమ్ మణ్‌పాణైయుమ్. ప్రభు,కాళిదాస్ జయరామ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి పూజాకుమార్, ఆస్నా జవేరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఊర్వశీ, ఎంఎస్.భాస్కర్, సంతాన భారతి, ఆర్‌ఎస్.శివాజీ నటిస్తున్నారు.

Nag, Kamal in Guest roles

నవ దర్శకుడు అముదేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌ను మలేషియాలో పూర్తి చేసుకుని యూనిట్ ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో కమలహాసన్ నటించడం గురించి వారు తెలుపుతూ నడిగర్ తిలగంపై ప్రేమాభిమానాల కారణంగానే ఆయన అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు.దీనికి ఆర్‌ఎస్.శివాజీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

English summary
Nagarjuna do a guest role in 'Nirmala Convent' film and he is produced the movie on his home banner Annapurna Studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu