క్రిస్మస్ సందర్భంగా రిలీజయిన నాగార్జున కింగ్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. కామిడీ బావుందన్నా..టోటల్ గా సినిమా నచ్చటంలేదని పెదవి విరుస్తున్నారు. అందులోనూ లెంగ్త్ ఎక్కువై విసుగు తెప్పిస్తోందని..ట్రిమ్ చేస్తే బాగుంటుందని చాలా మంది సూచించటంతో పది నిముషాలపాటు ట్రిమ్ చేసారు. ఈ రోజు నుండి ధియోటర్స్ లో ఇది అమలు అవుతుంది. మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా డ్రాప్ అవ్వకుండా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఈ మధ్య దాదాపు ప్రతీ సినిమాని ట్రిమ్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే శ్రీను వైట్ల సినిమాకి ఎప్పుడూ ఆ తరహా ప్లాభ్లం ఎదురుకాలేదు. అయితే తొలిసారిగా ఈ సమస్య ఎదురుకోవటంతో కింగ్ కీ కటింగ్ తప్పలేదంటున్నారు.