నాగార్జున ‘లవ్ స్టోరీ’ లేటెస్ట్ అప్డేట్స్

By Bojja Kumar

హైదరాబాద్ : నాగార్జున-నయనతార జంటగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపకుంటోంది. ఇటీవలే యూరఫ్ లో ఓ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలో బ్యాంకాక్ లో షూటింగుకు రెడీ అవుతోంది. ఇక్కడ ఓ సాంగు చిత్రీకరణతో పాటు కొన్ని సీన్లు, యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. దాదాపు 30 రోజు పాటు బ్యాంకాక్‌లో షూటింగ్ నిర్వహించనున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సదరు చానల్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X