For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డు స్థాయిలో నాగ్ ‘లవ్ స్టోరీ’ శాటిలైట్ రైట్స్!

    By Bojja Kumar
    |

    కింగ్ నాగార్జున్, సౌతిండియా బ్యూటీ నయనతార కలిసి నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. నాగార్జున కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈచిత్రం శాటిలైట్స్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో రూ. 6 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ తెలుగు రీజనల్ ఛానల్ ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది.

    నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సదరు చానల్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

    ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. త్వరలో ఈచిత్రం యు.ఎస్ లో 40 రోజుల భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. అనీల్ బండారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం.

    నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

    English summary
    The buzz doing the rounds in Tollywood is that the satellite rights of upcoming Nagarjuna's biggie Love Story have fetched its producers a cool Rs.6 crores. And this is the one of the biggest amount that a Telugu film has fetched for screening on television.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X