ఎయిర్ పోర్టులో నాగ్-నయన లవ్‌స్టోరీ!
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, నయనతార జంటగా దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లతో పాటు కె.విశ్వనాథ్ లపై సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్


Click it and Unblock the Notifications











