For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్విట్జర్లాండ్ లో ముగిసిన నాగ్ ‘లవ్ స్టోరీ’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. తాజాగా ఈచిత్రం స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ రెండో వారంలో స్విస్ చేరుకున్న చిత్ర యూనిట్....అక్కడ నాగార్జున, నయనతారపై పాటల చిత్రీకరణతో పాటు, టాకీ పార్టుకు సంబంధించిన కొన్ని సీన్లు చిత్రీకరించారు. అక్కడ షూటింగ్ పూర్తవడంతో సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

    ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. నాగార్జున కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈచిత్రం శాటిలైట్స్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో రూ. 6 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ తెలుగు రీజనల్ ఛానల్ ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సదరు చానల్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

    ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

    English summary
    King Nagarjuna, Nayanatara starrer romantic entertainer Love Story has just wrapped up the Switzerland schedule. The unit, which left to the largest city in Switzerland in the second week of September, shot a song on Nagarjuna and Nayanatara, along with few talkie part scenes and returned to Hyderabad on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X