For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున-నయనతార....‘సరిలేరు నీకెవ్వరు’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కింగ్ నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రానికి తాత్కాలికంగా 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి అఫీషియల్ టైటిల్ ఖరారు చేసారు. 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ ఈచిత్రానికి ఖరారు చేసారు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు.

    'సరిలేరు నీకెవ్వరు' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపకుంటోంది. ఇటీవలే యూరఫ్ లో ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బ్యాంకాక్ లో కొంత షూటింగ్ జరిపారు. ఇక్కడ ఓ సాంగు చిత్రీకరణతో పాటు కొన్ని సీన్లు, యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసారు.

    ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు.

    గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

    ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

    English summary
    
 Nagarjuna, Nayantara starret Love story (tentative title ) has been titled as "Sarileru neekevvaru" officially. This movie is produced by Chandan Reddy under Kamakshi movie banner and Music by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X