ముక్కోటి ఏకాదశి నాడే నాగార్జున 'రగడ' చెస్తాట్ట!!
నాగార్జున, వీరూపోట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం ముక్కోటి ఏకాదశి రోజున (డిసెంబర్ 16) న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కామాక్షి మూవీస్ బ్యానర్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అనూష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో ఛార్మి ఓ ఐటం సాంగ్ కూడా చేయబోతోంది. అంతేగాక నాగార్జున ఈ చిత్రంలో రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతూంటారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి రగడ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే నాగార్జున టైటిల్ విషయంలో ఇంకా తామేమీ నిర్ణయించుకోలేదంటున్నారు. వీటితో పాటు నాగార్జున...రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి రాజన్న అనే టైటిల్ ఫిక్స్ చేసారు. వీటితో పాటుగా నాగార్జున..త్వరలో అరుంధతి తరహా ఓ సోషియో ఫాంటసీ చిత్రలో నటించబోతున్నారు. కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో మొదలయిన గగనం చిత్రం షూటింగ్ పూర్తయింది.


Click it and Unblock the Notifications











