»   » కొడుకుల పెళ్ళిళ్ళ పై నాగార్జున అఫీషియల్ గా మాట్లాడాడు

కొడుకుల పెళ్ళిళ్ళ పై నాగార్జున అఫీషియల్ గా మాట్లాడాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:గత కొద్ది రోజులుగా నాగార్జున ఇద్దరు కుమారులు అఖిల్, నాగచైతన్య ల వివాహాల గురించే మీడియాలో హాట్ టాపిక్ రన్ అవుతోంది. ఈ విషయమై ఇంతకు ముందు ఓ ఇంగ్లీష్ దిన పత్రికతో మాట్లాడుతూ.. తన కుమారులు నాగచైతన్య, అఖిల్‌ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడం సంతోషమే అని నాగార్జున ప్రకటించారు.
తాజాగా వారి పెళ్లిపై నాగ్‌ మరోసారి స్పందించారు. వినాయిక చవతి సందర్బంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. కుమారుల పెళ్లి విషయం ప్రసక్తి వచ్చినప్పుడు మాట్లాడుతూ ..ఆ విషయం గురించి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెబుతానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Nag Opens up about Sons' Marriages

అలాగే..అక్టోబర్‌లో నాగచైతన్య-కల్యాణ్‌కృష్ణ.. అఖిల్‌-విక్రమ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో చిత్రాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తనకు 'నిన్నేపెళ్లాడతా' చిత్రమంటే చాలా ఇష్టమని, అలాంటి స్క్రిప్ట్‌నే కల్యాణ్‌కృష్ణ తయారు చేశారని, చైతన్య ఆ చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు దర్శకుడు కల్యాణ్‌కృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

అక్టోబర్‌ చివరినాటికి 'ఓం నమో వెంకటేశాయ' చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని.. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక 'సోగ్గాడే-2 బంగార్రాజు' చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని నాగార్జున స్పష్టం చేశారు.

English summary
Nagarjuna said that he he will confirm the muhurath for the marriages of his sons on an auspicious day, soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu