twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కేడీ' చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఏమిటంటే...

    By Srikanya
    |

    ఈ నెల 12న రిలీజు కానున్న 'కేడీ' చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ పేరు రమేష్‌. అందరూ 'రమ్మీ' అని పిలుస్తారు. 'రమ్మీ' వ్యక్తిగతంగా మనిషి చాలా మంచోడు. అయితే లోకం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది అనుకుంటాడు. ఎంతటి ఘనకార్యాన్నైనా సులువుగా చేసేస్తాడు. అతని గారడీతో వినోదం పంచుతూంటాడు. డబ్బు లేకపోతే లోకంలో ఏమీ సాధించలేం అనుకునే రమ్మీ...దాన్ని సంపాదించడానికి ఎంచుకున్న మార్గమే ఏం చేసాడు అన్నదే ఈ కథ. మొదటనుంచీ అనుకుంటున్నట్లుగానే ఇందులో నాగార్జున పేక ముక్కలతోనూ కనిపిస్తారు అయితే ఈ కథ మాత్రం జూదం చుట్టూ తిరిగేది కాదు అంటున్నారు.

    ఇక ఈ 'కేడి'లో పేరుకు తగ్గట్టే భలే నాగార్జునది కిలాడీ పాత్ర. పక్కవాళ్లని ఏదో రకంగా మాయచేసి దారిలోకి తెచ్చుకుంటాను. ఒకరూ..ఇద్దరూ అని కాకుండా హోల్‌సేల్‌గా అందర్నీ బుట్టలో పడేస్తాడు. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకత స్క్రీన్ ప్లే నే అంటున్నారు నాగార్జున. ఆయన మాటల్లోనే ...కథనం. చాలా...చాలా బాగుంటుంది. ఈ విషయం గుండెల మీద చేయి వేసుకుని మరీ చెబుతాను. కథని నడిపించిన తీరు ఆసక్తిగా ఉంటుంది. ఈ సన్నివేశం ఇలా ఎందుకు జరిగింది? దీని తరువాత ఏంటి? అనే ప్రశ్నలు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్ని వెంటాడతాయి. వాళ్ల ఆలోచనలను దాటుకుని ఆ చిక్కుముళ్లన్నీ విప్పేస్తాం. అవి చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది అంటున్నారు. ఇక ఈ 'కేడి'తో కిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X