రజాకార్ల ఉద్యమం నేపధ్యంలో నాగార్జున
నాగార్జున హీరోగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి రాజన్న అనే టైటిల్ పెట్టారనే సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కథ రజాకార్ల ఉద్యమం నేఫద్యంలో జరగుతుంది. ఈ చిత్రం కథ జరిగే కాలం..1945-55. ఇక ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు. అలాగే రాజమౌళి ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. నాగార్జున ఈ చిత్రం స్టోరీ లైన్ విని ఆయన సొంత బ్యానర్ అన్నపూర్ణలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో తన పాత్ర..తన పాతికేళ్ళ నటనా కెరీర్ ని మలుపుతిప్పే పాత్ర అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున ప్రస్తుతం వీరూపోట్ల దర్శకత్వంలో కామాక్షి ఎంటర్ ప్రైజస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. అనుష్క,ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.అలాగే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే సోషియో ఫాంటసీ చిత్రం కూడ త్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











