మహిళ డైరెక్టర్ తో రెడీ-నాగ్
వెంకటేష్ ఆడవేషం వేయాలని వింత కోరిక కలిగితే అలాంటి కోరికే అక్కినేని నాగార్జునకు కూడా కలిగింది. ఎక్సపరిమెంట్లు చేయడంలో ముందుండే నాగార్జున మరో ఎక్సపరిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నాడన్నమాట. ఇప్పటికే యువ పేరుతో టీవీ సీరియల్ కు శ్రీకారం చుట్టిన నాగార్జున స్వతహగా వ్యక్తిగత స్టైలిస్ట్ అస్మిత మార్వాను కలిగిఉన్నాడు. కోరియోగ్రఫీ నుంచి డైరెక్టర్ లారెన్స్ అవతారం ఎత్తడానికి కూడా నాగార్జునే కారణం. తాజాగా రూపొందుతున్న డాన్ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తానంటే కూడా లారెన్స్ ను వద్దనలేదు. కానియ్యన్నాడు. దర్శకత్వంతో పాటు సంగీతదర్శకత్వం కూడా లారెన్స్ వహిస్తున్నాడు. ఎవరైనా మహిళా డైరెక్టర్ ఎవరైనా ముందుకువస్తే వారి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని నాగార్జున అంటున్నాడు. అసలే నాగార్జున అంటే అమ్మాయిలు పడి చస్తారు. ఈ వార్తవిని మహిళా అభిమానులు రాత్రికి రాత్రే మహిళా డైరెక్టరుల అవతారమెత్తి నాగార్జున ముందు వాలతారేమే. వేచి చూడాలి.


Click it and Unblock the Notifications