»   » దేవుడా..దీనికి అంతేలేదా? : నాగ్ 'ఓం నమో వెంకటేశాయ' సినిమా కూడా లీక్‌

దేవుడా..దీనికి అంతేలేదా? : నాగ్ 'ఓం నమో వెంకటేశాయ' సినిమా కూడా లీక్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి-2' సినిమా క్లిప్పింగ్‌లను చోరీ కేసు ఇప్పటికే ఇండస్ట్రీని షాక్ ఇస్తూండగా మరో విషయం ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేసింది. నాగార్జున హీరోగా రూపొందుతున్న నమో వెంకటేశాయి చిత్రం క్లిప్ లు సైతం బయిటకు వచ్చేసాయని. దాంతో నాగార్జునతో సహా నమో వెంకటేశాయ టీమ్ మొత్తం తలలు పట్టుకున్నారట.

వివరాల్లోకి వెళితే... బాహుబలి చిత్రంలో యుద్దం సన్నివేశాలను చోరీ చేసి.. షేర్‌ చేసిన కేసులో బెజవాడ పోలీసులు ఆరుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లతోపాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ సినిమా క్లిప్పింగ్‌ను కూడా గుర్తించారు. అయితే అదృష్టవశాత్తు ఈ దృశ్యాలు ఎవరికీ షేర్‌ చేయలేదని తెలిసింది.


విజయవాడలోని సెంట్రల్‌ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సత్యానందం, టాస్క్‌ఫోర్సు ఏసీపీ మురళీధర్‌లు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. బహుబలి-2 సినిమా క్లిప్పింగ్స్‌ను ఎడిటింగ్‌ విభాగంలో పని చేస్తున్న కృష్ణదయానంద్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని... తన స్నేహితుడు అయిన అక్కి కృష్ణచైతన్యకు పంపించాడు.


Nag's Om Namo Venkatesaya movie scenes leaked, 6 arrested

కృష్ణచైతన్య ఆ క్లిప్పింగ్‌ను తన ఇద్దరు స్నేహితులైన బీకాం విద్యార్థులు నూరుద్దీన, సర్వోత్తమ్‌లకు షేర్‌ చేశారు. వారు తమ స్నేహితులైన బీటెక్‌ విద్యార్థులు పార్థూ శ్రీను, సాయి సుదర్శనలకు పంపించారు. కృష్ణ దయానంద్‌తోపాటు ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.


దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఓం నమో వెంకటేశాయ. అక్కినేని నాగార్జున హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హథీరాంబాబా జీవిత నేపధ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయి తర్వాత నాగ్- రాఘవేంద్రరావు కాంబినేషనల్‌లో వస్తోన్న మరో భక్తి రస చిత్రం ఓం నమో వెంకటేశాయ అభిమానులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.

English summary
Krishna Chaitanya, who was arrested in leaking scenes of Baahubali 2, has also confessed of stealing some scenes from Om Namo Venkatesaya movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu