కులుమనాలి వెళ్లనున్న నాగ్ ‘షిర్డి సాయి’ టీం
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజాగా చిత్రం 'షిరిడి సాయి' యూనిట్ త్వరలో షూటింగ్ నిమిత్తం కులు మానాలి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కర్నాటకలోని బదామి ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడ షెడ్యూల్ పూర్తయిందని, తర్వాతి షెడ్యూల్ కోసం ఫిబ్రవరి 29న అంతా కులుమనాలి ప్రయాణం అవుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో శ్రీకాంత్ సాయి భక్తుడైన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. కమలినీ ముఖర్జీ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.
నాగార్జున హీరోగా గతంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి భక్తి రస చిత్రాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'షిరిడి సాయి' చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లిపై ఎ. మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, వేది వ్యాస్, సత్తిపండు, సినిమాటో గ్రఫీ ఎస్. గోపాల్ రెడ్డి, కళ : భాస్కర్ రాజు, శ్రీకాంత్


Click it and Unblock the Notifications











