నాగార్జున 'శిరిడి సాయి' ప్రత్యేకత ఏంటి
నాగార్జున తాజాగా 'శిరిడి సాయి'అనే భక్తి రస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కీ రోల్ చేస్తున్నఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులుమనాలిలో చిత్రీకరణ సాగుతోంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నాగార్జునపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం విషేషాలు నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిస్తున్నారు.
ఇటీవలే కర్ణాటకలో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్, సంగీతం: కీరవాణి.


Click it and Unblock the Notifications











