twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘గగనం’ పై కావాలనే పోటికి ‘వస్తాడు నా రాజు’..!?

    By Sindhu
    |

    హీరో మంచు విష్ణు 'ఢీ" సినిమా హిట్ అవ్వటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఆ తర్వాత విష్ణు సినిమాలు సక్సెస్ యిన పాపాన పోలేదు. ఆకరికి వైవియస్ చౌదరి తీసిన 'సలీమ్" కూడా చాలా దారుణంగా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత 'వస్తాడు నా రాజు" సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మింస్తున్నాడు విష్ణు తండ్రి మోహన్ బాబు. 'వస్తాడు నా రాజు" విష్ణు హీరోగా ఈరోజు (11.02.11) విడుదల చేస్తున్నారు.

    అయితే ఇదే రోజు నాగార్జున నటించిన 'గగనం" కూడా విడుదల అవుతుంది. అయితే నాగార్జున విష్ణు కంటే పెద్ద హీరో అని వేరే చెప్పక్కర్లలేదు! పైగా బిజినెస్ విషయంలో కూడా నాగార్జున సినిమా అంటే బయ్యర్లు సిద్దంగానే ఉంటారు. మంచు విష్ణు విషయంలో 'వస్తాడు నా రాజు" అంతంత మాత్రంగానే అయ్యిందని ఫిలింనగర్ టాక్ అయినా మంచు విష్ణు, నాగార్జునను ఏమి లెక్కచేయకుండా నాగార్జున 'గగనం"కు పోటీగా వస్తాడు నా రాజు ను విడుదల చేస్తున్నాడు. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడంతో సినీ సర్క్యూట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    మంచు విష్ణు కావాలనే తన సినిమాను 'వస్తాడు నా రాజు" ను పోటీకి వదులుతున్నాడని తెలిసింది. గతంలో మంచు విష్ణు, నాగార్జున కలసి మంచు మోహన్ బాబు బ్యానర్ లో నటించారు. సినిమా పేరు 'కృష్ణార్జున" ఈ సినిమాలో నాగార్జున పాత్ర తక్కువగా ఉన్నా, నాగార్జున మాత్రం తన పారితోషకాన్ని ఏ మాత్రం తగ్గించకుండా మోహన్ బాబు ముక్కుపిండి వసూళ్లు చేశారు. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకొని 'నాగర్జున"కు పోటీగా తన సినిమాను వదులుతున్నాడని టాక్.

    English summary
    Nagarjuna and Vishnu Manchu are going to have a face to face clash on 11th of this month as their movies are releasing on the same day. If we look into the pre release talk of these movies, both of the movies have got not so encouraging talk inside film nagar circles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X