twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెట్రోల్ లేకుండా.. డైరెక్టర్ నాగ అశ్విన్ కారు డ్రైవ్ చేస్తారు తెలుసా? ఏలా అంటే (వీడియో)

    By Rajababu
    |

    Recommended Video

    Mahanati Director Nag Ashwin Interview About Solar Car (Exclusive)

    ఎలక్ట్రికల్ కార్లు సాధారణంగా పెట్రోల్ లేకుండా బ్యాటరీలతో నడుస్తాయి. ఇలాంటి కార్లు పర్యావరణానికి మంచింది. పెట్రోల్ ఖర్చులు ఆదా అవుతాయి. కారు చార్జింగ్‌కు 10 యూనిట్ల ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది. సాధారణంగా బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దాని వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది. అలాంటి ముప్పును నివారించడానికి సౌరశక్తి ఉపయోగపడుతుంది అని నాగ అశ్విన్ వెల్లడించారు.

    సోలార్ పవర్‌తో

    సోలార్ పవర్‌తో

    ప్రభుత్వ సబ్సిడీతో 6 కిలోవాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఏర్పాటు చేశాం. ఒక యూనిట్ విండ్ పవర్‌ సిస్టం ఏర్పాటు చేశాం. మొత్తం 7 యూనిట్లతో మిని పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొన్నాం. కారు చార్జింగ్‌కు సరిపడా సోలార్ పవర్ లభిస్తుంది. మిగిలితే ఇంటికి, మా హాస్పిటల్ కోసం వాడుకొంటున్నాం అని ఆయన తెలియచేశారు.

     సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు

    సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు

    సోలార్ ప్యానెల్స్, విండ్ పవర్ ఏర్పాటు చేసుకొన్న తర్వాత దాదాపు 9 వేల కిలో మీటర్లు తిరిగాను. మహానటి షూటింగ్‌ కోసం ఎక్కడికి వెళ్లాల్సి వచ్చిన ఆ కారులో తిరిగాను. సోలార్ పవర్ ప్యానల్ ఏర్పాటు, గవర్నమెంట్ పర్మిషన్స్ కలిపితే ఖర్చు తక్కువే. 9 వేల కిలోమీటర్లు తిరిగితే దాదాపు 90 వేల రూపాయాలు ఆదా చేశాను అని నాగ అశ్విన్ చెప్పారు.

     ఎంత బడ్జెట్ అంటే

    ఎంత బడ్జెట్ అంటే

    6 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు కోసం సుమారు రూ. 2 లక్షలు, విండ్ మిల్ కోసం ప్రత్యేకమైన టెక్నాలజీని ఏర్పాటు చేసుకొన్నాను. దాని కోసం కొంత మొత్తం ఖర్చు పెట్టాను. తక్కువ గాలి ఉన్న ఈ విండ్ మిల్ తిరుగుతుంది. పవర్ జనరేట్ చేస్తుంది అని నాగ అశ్విన్ పేర్కొన్నారు.

    పొల్యూషన్ ముప్పు

    పొల్యూషన్ ముప్పు

    ప్రతి సంవత్సరం ఓ కారు రోడ్డుపై తిరిగితే 1 మిలియన్ టన్ను పొల్యూషన్ వస్తుంది. అలానే హైదరాబాద్‌లో ఎన్ని కార్లు ఉన్నాయో లెక్కలేదు. దాని వల్ల ఎన్ని టన్నుల పొల్యూషన్ జనరేట్ అవుతుందో లెక్క కట్టలేం. దానివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఏర్పాడుతుంది అని దర్శకుడు నాగ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రభుత్వం అవగాహన కల్పించాలి

    సోలార్ పవర్‌‌తో ఆర్టీసి బస్సులను కూడా ప్రభుత్వ నడిపితే పర్యావరణానికి మంచింది. ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆర్టీసికి కూడా డబ్బులు ఆదా అవుతాయి. ప్రభుత్వం ముందుకు వచ్చి సోలార్ పవర్‌తో బస్సు నడిపితే వాహనదారులు కూడా సౌరశక్తిని ఉపయోగించడానికి స్ఫూర్తి కలిగించినట్లు అవుతుంది అని నాగ అశ్విన్ వెల్లడించారు.

    English summary
    Director Naga Ashwin's Mahanati movie getting very good response from all the corner. In this occassion, Filmibeat brings a special thing about Naga Ashwin. He drives car with solar power. Naga Ashwin explained how uses solar power for his car.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X