twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి బయోపిక్: మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ హాట్ టాపిక్!

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య బయోపిక్ చిత్రాల ట్రెండ్ రన్ అవుతోంది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా బయోపిక్ రావడం, మంచి విజయం అందుకోవడంతో పాటు ఆమెను మరోసారి తెలుగు సినీ అభిమానులంతా గుర్తు చేసుకుని, గుండెల్లో దాచుకునేలా చేసింది.

    'మహానటి' తర్వాత వరుస బయోపిక్ చిత్రాలు టాలీవుడ్లో మొదలయ్యాయి. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్స్ ఆల్రెడీ థియేటర్లలో సందడి చేశాయి. కానీ సావిత్రి స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ వర్కౌట్ కాలేదు. వైఎస్ఆర్ మూవీ గతవారం విడుదలై ఓ మోస్తరుగా రన్ అవుతోంది.

    చిరంజీవి బయోపిక్

    చిరంజీవి బయోపిక్

    ఇటీవల ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో ప్రచారంలోకి వచ్చింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎంతో మందికి స్పూర్తి, ఆయన జీవితంపై కూడా భవిష్యత్తులో బయోపిక్ వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

    చిరు బయోపిక్‌పై నాగబాబు

    చిరు బయోపిక్‌పై నాగబాబు

    మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ వార్తలపై ఆయన సోదరుడు నాగబాబు రియాక్ట్ అవుతూ... అన్నయ్య జీవితంలో ఆసక్తికర మలుపులు ఏమీ లేవు, కాబట్టి ఆయన జీవితంపై బయోపిక్ వస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. అయితే మెగా బ్రదర్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించడం లేదు.

    అభిమానుల్లో కోరిక ఉంది

    అభిమానుల్లో కోరిక ఉంది

    అయితే అభిమానుల్లో మాత్రం చిరంజీవి జీవితంపై బయోపిక్ రావాలనే కోరిక బలంగా ఉంది. చిరంజీవి పాత్రలో రామ్ చరణ్ నటిస్తే చూడాలని వారి ఆశ. ఎప్పటికైనా ఆయన జీవిత కథను తెరపై చూడాలని ఆశ పడుతున్నారు.

    చిరంజీవి జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు

    చిరంజీవి జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు

    మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఎన్నో ఆసక్తికర ఘటనలు ఉన్నాయని, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి... చిన్న చిన్న పాత్రలు వేసి, ఆపై హీరోగా అవకాశాలు దక్కించుకుని, అప్పటి వరకు ఉన్న పెద్ద పెద్ద స్టార్లను తన టాలెంటుతో అధిగమించిన వైనం, హార్డ్ వర్క్‌ను నమ్ముకుని నెం.1గా ఎదిగిన తీరు, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్పూర్తి దాయకం. చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగా చూపిస్తూ బయోపిక్ తీయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Recently Nagababu said that there are no such interesting turns in the life of Megastar Chiranjeevi, so he does not think there may be a biopic on Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X