చిన్నప్పుడు అలాంటి పనులు చేసి దొరికిపోయా.. ఆ చేష్టలపై నాగబాబు కామెంట్
మెగా బ్రదర్ నాగాబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన వేసే పంచ్ డైలాగ్‌లు ఎలా ఉంటాయో అందరూ చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన మీద వచ్చే ట్రోలింగ్‌లు, ఆయన చేసే కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఎంతటి సంచలనానికి దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య నాగబాబు తన ఇన్ స్టాగ్రాంలో ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్లు వేస్తున్నాడు.

మీమర్స్ సైతం షాక్..
గత వారం నాగబాబు తన ఇన్ స్టా ఫాలోవర్లతో చేసిన చిట్ చాట్ సెషన్ చూసి, అందులో నాగబాబు ఇచ్చిన ఆన్సర్స్ చూసి మీమర్స్ సైతం షాక్ అయ్యారు. అన్నీ కూడా థగ్ లైఫ్ ఆన్సర్స్ ఇచ్చారేంటి అని రకరకాల మీమ్స్ వేసేశారు. నాగబాబు సెటైర్ల మీదే సెటైర్లు వస్తూ మీమ్స్ వచ్చాయి.

తాజాగా కూడా..
అయితే తాజాగా నాగబాబు మరోసారి తన నోటికి పదును చెప్పారు. తన ఫాలోవర్లతో మరోసారి ముచ్చటించారు. ఇందులోనూ నాగబాబు దుమ్ములేపేశాడు.వరుణ్ తేజ్ పెళ్లి, ఆర్జీవీ, జబర్దస్త్, అనసూయ, రష్మీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటిపై తన స్టైల్లో స్పందించాడు.

కౌంటర్ల మీద కౌంటర్లు..
యూత్‌కు ఏమైనా సలహాలు ఇస్తారా? అని అంటే.. జియో సిమ్ వాడేవాళ్లకు ఏం చేయాలో అన్నీ తెలుసు.. అలాంటి వాళ్లకు సలహా ఇవ్వకూడదనేదే నా సలహా అంటూ కౌంటర్ వేశాడు. ఇక రెండో పెళ్లి చేసుకుంటారా? అని అంటే.. మీకు ఓకే అయితే నాకు ఓకే అంటూపంచ్ వేశాడు.

చిలిపి పనులు..
మీరు వర్జినా? అంటూ వకీల్ సాబ్ స్టైల్లో ఓ నెటిజన్ అడిగేశాడు. అరేయ్ ఏంట్రా ఇది అంటూ నాగబాబు ఆన్సర్ ఇచ్చాడు. ఇక చిన్నప్పుడు ఏదైనా చిలిపి పనులు చేసి దొరికిపోయారా? అంటూ ఓ నెటిజన్ అడగడంతో మరో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు.

అలా దొరికపోయా..
అలా నెటిజన్ అడిగిన చిలిపి పనుల గురించి నాగబాబు చెప్పాడు. చిన్నప్పుడు పక్కింట్లో వనజ అనే అమ్మాయి ఉందంట.. ఆమెకు లైన్ వేస్తూ ఉంటే.. ఆమె చూడలేదు గానీ వాళ్ల డాడీ చూశాడంటూ ఫన్నీగా సమాధానం చెప్పాడు. అయితే ఇది నిజమా? లేదంటే అలా ఊరికే కౌంటర్ వేశాడా? అన్నది తెలియడం లేదు.


Click it and Unblock the Notifications











