కళ్యాణ్ బాబు అలా అడిగేసరికి నా మైండ్ బ్లాంక్ అయింది: నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు ఎవరూ ఊహించని విధంగా ఏపీలో పోలింగ్ జరుగడానికి కొన్ని రోజుల ముందు జనసేన పార్టీలో చేరి, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు. ఊహించని విధంగా మొదలైన తన రాజకీయ జర్నీపై నాగబాబు స్పందించారు.
''నన్ను కళ్యాణ్ బాబు నర్సాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నిలబెట్టాడు. నేను ఒక పార్టీలో చేరి నేరుగా ఎన్నికల్లో పాల్గొంటాను అనేది మార్చి 16వ తేదీ వరకు నాకు కూడా తెలియదు, కళ్యాణ్ బాబు ఒక రోజు పిలిచి ఇలా అనుకుంటున్నాను నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగారు'' అని నాగబాబు తెలిపారు.

కళ్యాణ్ బాబు అలా అడిగేసరికి నా మైండ్ బ్లాక్ అయింది
ఎన్నికల్లో పోటీ చేయాలని కళ్యాణ్ బాబు అడిగేసరికి నా మైండ్ బ్లాంక్ అయింది. కంగారు పడ్డాను. ఆలోచించడానికి 12 గంటలు సమయం అడిగాను. తెల్లవారిన తర్వాత 10 గటలకు డెసిషన్ తీసుకున్నాను. తమ్ముడు అలా అడిగినపుడు ఎందుకు ఆలోచించానా? ఆ 12 గంటలు కూడా ఆలోచించడం కరెక్ట్ కాదనిపించిందని నాగబాబు చెప్పుకొచ్చారు.

నేను అలా చేయాల్సింది కాదు
‘‘జనసేన కోసం ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నపుడు ఒక ఎంపీగా నిలబడమని అడిగినపుడు ఎందుకు ఆలోచించానో అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో భయం వేసింది. అది చాలా పెద్ద బాధ్యత. అందుకే టెన్షన్ వచ్చింది. నా తమ్ముడు సోషల్ చేంజ్ కోసం, గొప్ప ఐడియాలజీతో, మంచి భావజాలంతో వచ్చాడు. అందుకే ఒకే చెప్పాను.'' అన్నారు.

చాలా తక్కువగా కలిసేవారం
ఎన్నికల ముందు వరకు కళ్యాణ్ బాబును కలుసుకోవడం చాలా రేర్‌గా ఉండేది. ఏ పండక్కో, ఏదైనా మీటింగుకు వచ్చినపుడు కలుసుకోవడం, అమ్మవాళ్ల ఇంటికి వచ్చినపుడు మాట్లాడుకోవడం జరిగేది. అయితే కళ్యాణ్ బాబు సినిమాల్లోకి రాక ముందు బాగా కలిసేవారం.. అపుడు ఇద్దరం ఫ్రీగా ఉండేవారం. తర్వాత తను సినిమా, పాలిటిక్స్‌లో బిజీ కావడం... నేను సీరియల్స్, టీవీ షోల వల్ల బిజీ కావడంతో కలిసే అవకాశాలు చాలా తక్కువ వచ్చేవని మెగాబ్రదర్ తెలిపారు.

వారు చూపించే ప్రేమ మందు లైఫ్ నథింగ్ అనిపించింది
మార్చి 19వ తేదీ నాకు బి ఫారం ఇచ్చారు. అక్కడ నుంచి నేరుగా భీమవరం వెళ్లి ప్రచారం మొదలు పెట్టాను. ప్రజా రాజ్యం సమయంలో ఆంధ్ర, తెలంగాణలో దాదాపు లక్షా 20 వేల కిలోమీటర్లు తిరిగాను. అపుడు ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసు. సారి డైరెక్ట్ ఎన్నికల్లో ఉన్నాను. నర్పాపూర్ లోక్ సభ నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమ చూపించారు. వారు చూపించే ప్రేమ మందు లైఫ్ నథింగ్ అనిపించింది. వారి కోసం ఏమైనా చేయవచ్చు అనిపించింది.

ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టా
మేము ఎక్కడా డబ్బులు పంచకూడదని నిర్ణయించుకున్నాం. అయితే మాతో పాటు వచ్చిన కార్యకర్తలకు ఫుడ్ పెట్టడం, వాళ్లు వచ్చే వాహనాలకు పెట్రోలు పోయించడం లాంటి వాటి కోసం ఖర్చు పెట్టాం. అవి ఎంపీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టే లెక్కలోకి వస్తాయి.

వారు వచ్చి మేమ ఈ కులం అని చెప్పి సపోర్ట్ చేశారు
‘‘మా కోసం వచ్చిన జనాలను, వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే కళ్లలో నీళ్లు వచ్చాయి. అన్ని కులాల వారు ప్రేమ చూపించారు. వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కాపులు, శెట్టిబలిజ, ఎస్సీలు, ఎస్టీలు, ఫిషర్‌మెన్ కమ్యూనిటీ... ఇలా అందరూ సపోర్ట్ చేశారు. వారే వచ్చి మేము ఈ కమ్యూనిటీ, మీకు సపోర్టు చేస్తున్నామని చెప్పారు.'' అని నాగబాబు గుర్తు చేసున్నారు.

కళ్యాణ్ బాబు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ టచ్ చేశాడని అర్థమైంది
వాళ్లు అలా వచ్చి మద్దతు ఇవ్వడంతో కళ్యాణ్ బాబు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ టచ్ చేశాడని అర్థమైంది. ఇలాంటి లీడర్ మాకు ఉన్నందుకు గర్వపడ్డాను. కళ్యాణ్ బాబు జనసేన పార్టీని ఒక మంచి భావ జాలంతో మొదలు పెట్టాడు. మనం ఎలా పని చేయాలనేది అంతా సెటప్ చేసి పెట్టాడు. మేము అది చేస్తే చాలు.

జబర్దస్త్ తప్ప వేరే పని కూడా లేదు
‘‘గెలుస్తాననే నమ్మకం ఉంది. ప్రజలకు ఎలాంటి మంచి జీవితం ఇవ్వాలి, వారి సమస్యలు ఎలా తీర్చాలి, ఎవరితో పోరాడాలి అనేది అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నాను. నాకు వేరే పని కూడా ఏమీ లేదు. సినిమాలు మానేశాను, జబర్దస్త్ అనే ఒక షో తప్ప అన్నీ మానేశాను. నా రెస్టాఫ్ లైఫ్ నర్సాపూర్ నియోజకవర్గం, జనసేన పార్టీ కోసమే'' అని నాగబాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











