పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు: నాగబాబు
జనసేన అధినేత, తన సోదరుడు కళ్యాణ్ బాబు(పవన్ కళ్యాణ్) 2024లో అధికారంలోకి వస్తాడు అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. 'నా ఛానల్ నా ఇష్టం' పేరుతో య్యూట్యూబ్ ఛానల్‌లో 'పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు' అనే క్యాపన్షన్‌తో ఓ వీడియో విడుదల చేశారు.
ఏపీలో చాలా మంది ప్రజల నుంచి ఒకేట మాట వినిపించింది. ''చంద్రబాబు మీద, టీడీపీ మీద మాకు విపరీతమైన కోపం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తే ఆయన గవర్నమెంట్ ఫాం చేయలేడేమో? డౌట్ ఉంది. చంద్రబాబును ఓడించాలంటే జగన్ ఒక్కడే దొరికాడు.'' అని చెప్పారని నాగబాబు తెలిపారు.

వాళ్లు చాలా పాజిటివ్‌గా మాట్లాడారు
2024లో కళ్యాణ్ బాబును మేము తప్పకుండా గెలిపించుకుంటాం. ఈ సారి మాత్రం జగన్ గారికే ఓటేస్తాం అని చాలా మంది చెప్పారు. వారు చెప్పినట్లు ఎన్నికల్లో చేశారు. ప్రజలు చాలా పాజిటివ్ గానే మాట్లాడారు. వారిని తప్పుగా భావించాల్సిన పని లేదని నాగబాబు తెలిపారు.

ఓడి పోవడానికి వంద కారణాలుంటాయి
రాజకీయాల్లో గెలవటం, ఓడిపోవడం ఒక కాయిన్‌కు రెండు సైడ్స్ లాంటివి. గెలిచినంత మాత్రాన గొప్పవాడైపోయి గెలిచాడనో, ఓడిపోయినంత మాత్రాన చేతకాక ఓడిపోయాడనో... అనడం సరైంది కాదు. ఓడిపోవడానికి వంద కారణాలు ఉంటాయని నాగబాబు తెలిపారు.

ఓటమిలో నా మిస్టేక్ కూడా ఉంది
‘‘జనసేన ఓడిపోవడానికి ఎవరు ఎంత బాధ్యత తీసుకున్నారో తెలియదు. నా వరకు గెలుపోటముల విషయంలో నేను సంపూర్ణమైన బాధ్యత తీసుకున్నాను. ఓడిపోవడానికి నేను ఇంకా కొంచెం పని చేయాల్సి ఉందేమో? కరెక్టుగా కాంపెయిన్ చేసి ఉండాల్సిందేమో? ఆ పార్టు వరకు నేను నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఓడిపోవడంలో నా మిస్టేక్ కూడా ఉంది. ఇంకాస్త ప్రచారం చేస్తే బావుండేదేమో?'' అని నాగబాబు చెప్పుకొచ్చారు.

జగన్‌కు అది బాగా కలిసొచ్చింది.
వైసీపీకి జగన్ మీద వారి తండ్రి తాలూకు సింపతీ కానీ, జగన్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి... ఈ రెండు సింపతీలు బాగా వర్కౌట్ అయ్యాయి. అంతకు ముందు జగన్ గారు పరిపాలన చేసి ఉంటే ఆయన గొప్పగా పరిపాలించారు కాబట్టి గెలిచారు అని చెప్పడానికి ఉండేది. ఇంతకు ముందు ఆయన ప్రభుత్వంలో లేరు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా యాత్రలు చేశారు. అదొక అడ్వాంటేజ్, ఒక్కసారి జగన్ గారికి ఛాన్స్ ఇద్దాం, పవన్ కళ్యాణ్‌కు 2024లో ఇద్దాం అని ప్రజలు ఫీలయ్యారని మెగా బ్రదర్ అభిప్రాయ పడ్డారు.


Click it and Unblock the Notifications











