ఆ ఒక్క రూపాయి తిరిగిచ్చేశాడట.. నాగబాబు నిజాయితికి నిలువెత్తు నిదర్శనం!!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావాలనే వివాదాస్పద అంశాలను టచ్ చేస్తాడో లేక నాగబాబు టచ్ చేసే ప్రతీ అంశం వివాదాస్పదంగా మారుతోంతో తెలియని పరిస్థితి. లాక్ డౌన్, కరోనా విజృంభణ సమయంలో నాగబాబు చేసిన కామెంట్లు మీడియాలో ఎంతటి సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తన యూట్యూబ్ చానెల్‌ ద్వారా చేసే కామెంట్స్ నెటిజన్లు ఆకట్టుకుంటాయి. తాజాగా నాగాబాబు మనుసును దోచిన ప్రకటనల గురించి వివరించాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

కాంట్రవర్సీలకు దూరంగా..

కాంట్రవర్సీలకు దూరంగా..

ఆ మధ్య నాగబాబు కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మలపై కామెంట్స్ చేయడం, గాడ్సేపై తన అభిప్రాయాన్ని చెప్పడం, దేవుళ్లపైనా కామెంట్స్ చేయడం, కరోనా వ్యాప్తిపై ప్రజలను, ప్రభుత్వాలను హెచ్చరించడం ఇలా ఏదో ఒకటి చేసి సంచలనంగా మారే నాగబాబు గత కొన్ని రోజులనుంచి సైలెంట్‌గా ఉంటున్నాడు.

సొంత పనుల్లో..

సొంత పనుల్లో..

నాగబాబు ప్రస్తుతం తన సొంత పనుల్లోనే నిమగ్నమయ్యారు. తాను సొంతంగా రెండు కామెడీ షోలను ప్రారంభించడం, టాలెంట్‌ను వెలికి తీయడం వంటి వాటిల్లో బిజీగా అయ్యాడు. ఖుషీ ఖుషీగా, విజిల్ అంటూ కామెడీ షోలను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. వీటికి సంబంధించిన వివరాలను మాత్రమే యూట్యూబ్‌లో పెడుతున్నాడు.

పనికొచ్చే విషయాలు..

పనికొచ్చే విషయాలు..

నాగబాబు ఈ మధ్య పది మందికి పనికొచ్చే విషయాలను యూట్యూబ్‌లో పెడుతున్నాడు. ఆ మధ్య మెడిక్లెయిమ్ గురించి అందరికీ అవగాహన కలిగించాడు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనను కూడా వివరించాడు. ప్రతీ ఒక్కరూ మెడికల్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించాడు. ఇక తాజాగా తనకు నచ్చిన కొన్ని ప్రకటనల గురించి వివరించాడు.

కళ్యాణ్ జువెల్లరీ యాడ్..

కళ్యాణ్ జువెల్లరీ యాడ్..

ఆ మధ్య నాగార్జున వృద్దుడిగా నటించిన కళ్యాణ్ జువెల్లరీ యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తనకు రావాల్సిన దానికంటే పెన్షన్ ఎక్కువ రావడంతో.. వెనక్కి ఇచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటాడు. అందులో ఓ ఆఫీసర్ మాట్లాడుతూ.. నువ్వే ఉంచేసుకోవయ్యా.. ఏదో తప్పు జరిగి అలా వచ్చినట్టుంది.. ఎవ్వరికీ తెలియదు కదా అని అంటాడు. అయితే నాకు తెలుసు కదా అని నాగార్జున చెబుతాడు. ఇదే యాడ్ గురించి నాగబాబు వివరిస్తూ.. అందులో నిజాయితీ గురించి చెప్పిన విధానాన్ని మెచ్చుకున్నాడు.

Recommended Video

Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
ఒక్క రూపాయి తిరిగిచ్చేశా..

ఒక్క రూపాయి తిరిగిచ్చేశా..

నిజాయితీ గురించి నాగబాబు చెబుతూ.. ‘మనం తప్పు చేశామని ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ మనకు తెలుసు కదా. నిజాయితీగా ఉన్నట్టు నటించడం వేరు.. నిజాయితీగా ఉండటం వేరు. నా చిన్నతనంలో ఓ రెండు రూపాయలు పట్టుకెళ్లి.. కొన్ని తినే వస్తువులను కొన్నాను. అతను తిరిగి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక రూపాయి ఎక్కువగా ఇచ్చాడు. మళ్లీ నేను లెక్కపెట్టుకుంటే రూపాయి ఎక్కువగా రావడంతో.. తిరిగి వెనక్కి ఇచ్చాను. ఎందుకంటే అది నా రూపాయి కాదు. తప్పు జరిగిందని నాకు తెలుసు. అందుకే ఇచ్చేశాను' అని చిన్ననాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X