Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు.. నాగబాబు కామెంట్స్ వైరల్
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు.ఎంతో ప్రయత్నించి అదిరింది, బొమ్మ అదిరింది షోను నిలబెట్టాలని చూశాడు. కానీ నాగబాబు మాత్రం ఆ షోలను సక్సెస్ చేయలేకపోయాడు. అలా మొత్తంగా ఆ షోల నుంచి తప్పుకుని బుల్లితెరకు గుడ్ బై చెప్పేశాడు. నాగబాబు ప్రస్తుతం యూట్యూబ్ మీద పడ్డాడు. తన కొత్త షోలతో బిజీగా ఉన్నాడు. కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్..
నాగబాబు సోషల్ మీడియాను వాడినంతగా మరేతర సెలెబ్రిటీ వాడకపోయి ఉండొచ్చు. లాక్డౌన్ సమయంలో నాగబాబు పెట్టిన మంటలు ఎంతలా ఎగిసి పడ్డాయో అందరికీ తెలిసిందే. తన యూట్యూబ్ చానెల్లో పెట్టిన కొన్ని వీడియోలు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి.
కొత్త షోలు..
బుల్లితెరకు దూరంగా ఉన్న నాగబాబు ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ షో బాగానే రన్ అవుతోంది. అయితే నాగబాబు ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ అవ్వడం లేదు. వ్యూస్ కూడా మరీ ఎక్కువగా రావడం లేదు.
అడల్డ్ కామెడీ అంటూ..
ఖుషీ ఖుషీగా షోలో అడల్డ్ కంటెంట్ ఎక్కువైందనే కామెంట్లు వినిపిస్తుంటాయి. మన తెలుగులో ఇది చాలా తక్కువ అని.. ఇక హిందీ, ఇంగ్లీష్‌లో మరీ దారుణంగా ఉంటాయని సమర్ధించుకున్నాడు. అయితే ఇది 18 ప్లస్ వాళ్లకి మాత్రమే అని చెప్పాం కదా అంటూ కౌంటర్లు వేశాడు.
తాజాగా ఇలా..
నాగబాబు తాజాగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టాడు. నెటిజన్లు పెట్టిన వాటికి నాగబాబు ఆన్సర్లు ఇచ్చాడు. ఇందులో ఓ నెటిజన్ మాత్రం ఖుషీ ఖుషీగా అనే షో గురించి కామెంట్ చేశాడు. దానికి మెగా బ్రదర్ అదిరిపోయే కౌంటర్ వేశాడు.
షేర్ మాత్రం చేయరు..
ఖుషీ ఖుషీ షో చూస్తే టైం తెలియదు.. అప్పుడే అయిపోయిందా? అని అనిపిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి నాగబాబు స్పందిస్తూ.. మీరు ఇప్పుడు ఇలానే అంటారు.. చూసి షేర్ మాత్రం చేయరు.. వ్యూస్ ఎక్కడ అండి వ్యూసు.. అని సెటైర్ వేశాడు.