నిహారిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు: మా కులంలో దొరికితే మంచిదే, లేక పోతే..
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. తమ్ముడు జనసేన పార్టీకి మద్దతుగా ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబును ఇంటర్వ్యూ చేసిన ఓ ఛానల్ వారు... ఆయన నుంచి రాజకీయాలకు సంబంధంచి పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు.
ఈ ఇంటర్వ్యూలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలు, తన కూతురు నిహారిక, కుమారుడు వరుణ్ తేజ్ విషయాలు సైతం ప్రస్తావనకు వచ్చారు. నిహారిక పెళ్లి విషయం గురించి అడగ్గా నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

నిహారికకు త్వరలోనే పెళ్లి
ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీ అయిపోయిన తన కూతురురికి త్వరలోనే పెళ్లి చేస్తామని నాగబాబు తెలిపారు. ఆమె నటనా రంగంలోకి అడుగు పెట్టే ముందే ఈవిషయం చెప్పామని, ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలైనట్లు తెలిపారు.

2018 వరకు టైమ్ ఇచ్చాం
నిహారిక సినిమాల్లోకి వెళతా అన్నపుడు వెంటనే ఓకే చెప్పాను. అయితే మూడేళ్లలో పెళ్లి చేస్తాను, 2018 వరకు పెళ్లి గురించి ఎలాంటి ఒత్తిడి చేయను అని అప్పుడే కండీషన్ పెట్టాను. తాము ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెడతామని నాగబాబు తెలిపారు.

కులం గురించి పట్టించుకోను..
నిహారిక పెళ్లి విషయంలో మంచి అబ్బాయి అయితే చాలని మాత్రమే చూస్తాను... కులం గురించి పట్టించుకోను అని నాగబాబు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంచి అబ్బాయి, తనకు సూటయ్యే వాడు దొరికితే ఇప్పడు కూడా పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కాపు కులాన్ని గౌరవిస్తాను
కాపు కులాన్ని గౌరవిస్తాను, తమ కులంలో మంచి అబ్బాయి దొరికితే మంచిదే, లేకపోతే వేరే కులం అయినా మాకు సమ్మతమే. అబ్బాయి ముందు నిహారికకు నచ్చడం ముఖ్యం, అతడు మంచి వ్యక్తి అవ్వడం మాకు ముఖ్యం. పెళ్లి విషయంలో కులం గురించి అస్సలు పట్టించుకోనని నాగబాబు తేల్చి చెప్పారు.

గతంలో పెళ్లి వార్తలు
గతంలో నిహారిక-సాయి ధరమ్ తేజ్ పెళ్లాడబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని స్వయంగా నాగబాబు అప్పడే క్లారిటీ ఇచ్చారు. వరుసకు బావే అయినా వారు చిన్నప్పటి నుంచి అలా పెరగలేదని తెలిపారు.

నటించాలనేది నిహారిక కోరిక
నటించాలనేది నిహారిక కోరిక. నేను నటిస్తాను నాన్న అని గట్టిగా చెప్పి మరి తన పంతం నెగ్గించుకుంది. మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న తనకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉటుందని నాగబాబు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











