వరుణ్ యాక్సిడెంటుకు కారణం అదే, వారు సైకోలు, పవన్ సినిమాల్లోకి అలా రావొచ్చేమో... నాగబాబు

Recommended Video

Naga Babu About Pawan Kalyan Re Entry Into Films || Filmibeat Telugu

మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల ముగిశాక చాలా గ్యాప్ తీసుకుని అభిమానులతో లైవ్ చాటింగ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ యాక్సిడెంట్, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడం, జనసేన పార్టీకి సంబంధించిన అంశాలపై నాగబాబు రియాక్ట్ అయ్యారు.

చాలా మంది వరుణ్ బాబుకు యాక్సిడెంట్ ఎలా అయిందని అడుగుతున్నారు. అప్పుడప్పుడూ ఇలా అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. మన చేతుల్లో ఏమీ ఉండదని నాగబాబు తెలిపారు. లక్కీగా వరుణ్‌తో పాటు కారులో ఉన్న మరో హీరో అధర్వ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు.

యాక్సిడెంటులో తప్పు వారిదే

యాక్సిడెంటులో తప్పు వారిదే

కర్నూలు ఏరియాలో ట్రాఫిక్ కాన్సెప్ట్ తెలియని కొంతమంది యూ టర్న్ తీసుకునే ప్లేసులో వ్యతిరేక దిశ నుంచి లాంగ్ యూ టర్న్ తీసుకోవడం, వీళ్లు 90 నుంచి 85 స్పీడ్లో ఉండటం వల్ల దాన్ని తప్పించబోయి ఎడ్జ్ తగిలింది. వెంటనే బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. వరుణ్ ఎప్పుడూ కూడా సీటు బెల్ట్ పెట్టుకుంటాడు. ఆ బెల్ట్ చాలా సేవ్ చేసిది. మా వాడికి ఏమీ కాకపోవడం మా అదృష్టమని నాగబాబు తెలిపారు.

వంద కారణాలు ఉంటాయి

వంద కారణాలు ఉంటాయి

ఎన్నికల తర్వాత ఎలా ఫీలవుతున్నారు అని కొందరు అడుగుతున్నారు. ఓడి పోవడం అనేది మాకు కొత్తేమీ కాదు. ఓడి పోవడానికి వంద రీజన్స్ ఉంటాయి. గెలవడానికి అంతకంటే ఎక్కువ రీజన్స్ ఉంటాయి. మా ఓటమికి కారణాలు ఏమిటనే విషయం విశ్లేషించుకుంటున్నాం. టెక్నికల్‌గా, పార్టీ పరంగా నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నామని నాగబాబు తెలిపారు.

నా నెక్ట్స్ స్టెప్ అదే...

నా నెక్ట్స్ స్టెప్ అదే...

పొలిటీషియన్‌గా నా నెక్ట్ష్ స్టెప్.... ఇకపై నా నియోజకవర్గంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. పవన్ కళ్యాణ్, జనసేనతోనే నా ట్రావెల్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. నరసాపురంలో నెలలో ఎక్కువ రోజులు ఇకపై ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం

ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం

వైసీపీని ప్రజలు గెలిపించారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. మాకు వేరే దారి కూడా లేదు. అలా అని వారు మాకు ఓట్లేయలేదని తిట్టుకోవడం, వారి గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎన్నికల తర్వాత చాలా మంది వద్ద అభిప్రాయాలు తీసుకున్నాం. వారు చెప్పిన రీజన్స్ చాలా కన్విన్సింగ్ గా అనిపించాయని నాగబాబు తెలిపారు.

ఆరోగ్యం దెబ్బతిన్నమాట నిజమే

ఆరోగ్యం దెబ్బతిన్నమాట నిజమే

ఈ మధ్య కాలంలో నా హెల్త్ దెబ్బతిన్నమాట నిజమే. దానికి కారణం సరైన ఎక్సర్ సైజ్, ప్రాపర్ డైట్ లేక పోవడమే. ఇప్పుడు ఎలాగూ నాకు పెద్ద పని లేదు కాబట్టి ఆరోగ్యం విషయంలో దృష్టి పెడతాను. మున్ముందు నాలో చాలా మార్పు చూస్తారని తెలిపారు.

కళ్యాణ్ బాబు సినిమాలు వద్దనుకున్నారు

కళ్యాణ్ బాబు సినిమాలు వద్దనుకున్నారు

పవన్ కళ్యాణ్‌ను ఒక సినిమా అయినా చేయమని చెప్పండి సార్ అని అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ... కళ్యాణ్ బాబు నాకు తెలిసి సినిమాల్లో యాక్ట్ చేయడు, సినిమాల్లో చేస్తూ రాజకీయాలు చేయడం అంటే సరైన ఆలోచన కాదు. ఒక సారి కళ్యాణ్ బాబు నేను సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత మళ్లీ రారు. చిరంజీవిగారు రాజకీయాలు వద్దనుకున్నారు కాబట్టే మళ్లీ సినిమాల్లో వచ్చారు. కళ్యాణ్ బాబు సినిమాలు వద్దనుకున్నారు. రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నారని నాగబాబు తెలిపారు.

అలా సినిమాల్లో కనిపిస్తాడేమో?

అలా సినిమాల్లో కనిపిస్తాడేమో?

ఇటీవల జరిగిన రివ్యూ మీటింగులో కూడా సినిమాలు చేయను అని కళ్యాణ్ బాబు చెప్పాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వమంటే చేస్తాడేమో? అంతే కానీ హీరోగా అయితే సినిమా చేసే అవకాశం లేదని నాగబాబు తెలిపారు.

సైకోలే అలాంటి పనులు చేస్తారు

సైకోలే అలాంటి పనులు చేస్తారు

వరంగల్‌లో 9 నెలల పాపపై అత్యాచారం, హత్య ఘటనపై స్పందిస్తూ... ఇలాంటివి చేసే వారు సైకోలు, వారంతా సిక్ పీపుల్. ఓ సర్వే ప్రకారం ప్రపంచ జనాభాలో ఇలాంటి సైకోలు ఒక శాతం ఉంటారు. మన ఇండియా జనాభా ప్రకారం చూసుకుంటే ఇక్కడ దాదాపు కోటి మందికి పైగా సైకోలు ఉన్నారు. వీరంతా మన చుట్టూ తిరుగుతుంటారు. మన వాళ్లే అయుండొచ్చు. కొన్ని సార్లు వారు చేసే సైకో చేష్టలు చాలా దారుణంగా ఉంటాయని నాగబాబు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X