ఆర్జీవీతో ఉన్న గొడవ అదే.. బయటపెట్టేసిన నాగబాబు.. అది చూసి అంతా షాక్
మెగా బ్రదర్ నాగబాబు, ఆర్జీవీకి మధ్య జరిగే కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. వర్మకు మెగా ఫ్యామిలీ అంటే చాలు ఎక్కడో కాలుతూ ఉంటుంది. అందుకే ప్రతీ సారి ఆర్జీవీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తుంటాడు. అయితే వాటికి అంతే స్థాయిలో మెగా బ్రదర్ నాగబాబు కూడా కౌంటర్లు ఇస్తుంటారు. ఇలా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో వేసే పోస్ట్‌లు వివాదాలకు దారి తీస్తుంటాయి. అయితే తాజాగా నాగబాబు ఆర్జీవీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

నాగబాబు అలా..
ఈ మధ్య నాగబాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యాడు. ఈ క్రమంలో తన అభిమానులతో కాసేపు ముచ్చటించాడు.తన ఫాలోవర్లు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చాడు. ఈక్రమంలో రకరకాల ప్రశ్నలకు వింత సమాధానాలిచ్చాడు నాగబాబు. అందులో కొందరు ఆర్జీవికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

శివుడిలా మారిన వర్మ..
మహా శివరాత్రి సందర్భంగా వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శివుడి ఫోటోలను తన బొమ్మలతో మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు వర్మ. తానే శివుడిని అన్నట్టుగా వరుసగా ఫోటోలను వదిలాడు. తలపై గంగాదేవీగా శ్రీదేవిని పెట్టేశాడు. అలా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్అయ్యాయి.

నాగబాబుకు కూడా..
అయితే శివుడిలా మారిన వర్మ అంటే నాగబాబుకు బాగా ఇష్టం ఏర్పడినట్టుంది. ఆయన ఫోన్‌లో స్క్రీన్ లాక్, ఫోన్ వాల్ పేపర్‌గా ఆ ఫోటోలనే పెట్టుకున్నాడు నాగబాబు. ఈమేరకు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శివుడిలా మారిన వర్మ ఫోటోను షేర్ చేసిన తన ఫోన్‌లోని సీక్రెట్స్‌ను చెప్పేశాడు. అంతే కాకుండా తనకు ఈ మధ్యలో నచ్చిన ఫోటోలు కూడా ఇవే అని చెప్పుకొచ్చాడు.

గొడవ అదే..
ఓ నెటిజన్ మాత్రం క్రేజీ ప్రశ్న అడిగాడు. నమస్తే సర్.. మీకు ఆర్జీవీ గారికి నిజంగా గొడవలు ఏమైనా ఉన్నాయా? అని అడిగేశాడు. దీనికి నాగబాబు సమాధానం ఇస్తూ.. అవును ఒకప్పుడు గొడవలు ఉండే.. అది కూడా ఊర్మిళా గురించి అంటూ కౌంటర్ వేశాడు. అంతే కాకుండా ఊర్మిళా, ఆర్జీవీ ఫోటోలను కూడా షేర్ చేశాడు. మొత్తానికి నాగబాబు మాత్రం భలే సమాధానం ఇచ్చాడంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నాడు. వర్మ రంగీలా సినిమాతో ఊర్మిళా ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











