'అధినాయకుడు' మారాడు

ఇప్పటికే చిరంజీవి అభిమానులు ఎలా నడచుకోవాలో చెప్పే కథాంశంతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మాణమవుతోంది. దానిలో కూడా నాగబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దాంతో చిరంజీవి కొంతకాలంపాటు సినిమాలకు దూరమై, పూర్తిగా రాజకీయాల మీదే శ్రద్ధ వహిస్తారనే విషయం కన్ ఫర్మ్ అయినట్లంయింది. ఇక ఈ సినిమా స్క్రిప్టుకు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దటానికి రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు శంకర్ బ్యాంకాక్‌కు వెళ్లారుట. కె. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను పూర్తి చేసి డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది చిరంజీవి సంకల్పం.


Click it and Unblock the Notifications











