చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. బ్లడ్, బ్రీడ్ అప్పుడేమైంది అంటూ ఘాటుగా నాగబాబు!

Recommended Video

Naga Babu Gives Clarification On Balakrishna Comments | Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు విమర్శల పరంపర కొనసాగుతోంది. బాలయ్య గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ నాగబాబు యూట్యూబ్ లో వీడియోలో పోస్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే నాగబాబు రెండు వీడియోల్లో బాలయ్య వ్యాఖ్యపై స్పందించగా తాజాగా మూడవ వీడియోని విడుదల చేశారు. నాగబాబు ఈ వీడియోలో విమర్శల ఘాటు పెంచారు. గతంలో చిరంజీవి రాజకీయాలపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు.

అమితాబ్ ఏం పీకాడు

అమితాబ్ ఏం పీకాడు

బాలకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో అమితాబ్, చిరంజీవి రాజకీయాలపై మాట్లాడారు. సందర్భంగా అమితాబ్ ఎం పీకాడు, చిరంజీవి ఏమయ్యాడు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు గురించి నాగబాబు మాట్లాడుతూ.. మీరు ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ అమితాబ్ ఏం పీకాడు అని అన్న మాటలు నన్ను బాధించాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంత పెద్ద స్టారో.. అమితాబ్, ఎంజీఆర్, రాజ్ కుమార్ కూడా అంతే పెద్ద స్టార్స్ అని నాగబాబు తెలిపారు.

 బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు

బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు

అక్కడ చిరంజీవి పేరెత్తడం అవసరమా.. చిరంజీవి ఏమయ్యాడు అని వ్యాఖ్యానించారు. పైగా మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని ప్రస్తావించారు. మరేమైనా ఆకాశం నుంచి దిగివచ్చారా. మమ్మల్ని అవమానించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కోపం రాదా. బాలకృష్ణని విమర్శిస్తున్నందుకు బాధపడే వారందరికీ ఇదే నా సమాధానం. అవతలి వ్యక్తులు కూడా ఎన్ని కామెంట్స్ చేస్తున్నారో తెలుసుకోండి అని బాలయ్య తెలిపారు.

మనుషులు మాట్లాడతారా

మనుషులు మాట్లాడతారా

బ్లడ్, బ్రీడ్ అంటూ మనుషులు మాట్లాడతారా అసలు.. ఆస్ట్రియా, ఇంగ్లాండ్ లో రాజవంశస్థులు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే తొక్కి పేడేశారు. ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు అని నాగబాబు గుర్తు చేశారు. మీరు ఇలా మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చాం అని నాగబాబు తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలని పట్టించుకోరు, స్పందించారు. రాంచరణ్, వరుణ్ కూడా ఇలాంటి వివాదాల జోలికి వెళ్లరని నాగబాబు అన్నారు.

అప్పుడేమైంది

అప్పుడేమైంది

మీరు దైవాంశ సంభూతులు కారు. మీరు కూడా మా లాగే మనుషులు అని నాగబాబు తెలిపారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. విజయం సాధించవచ్చు. ఎప్పుడూ ఓడిపోతూనే ఉండం. అలాగే ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉండడం సాధ్యం కాదని నాగబాబు తెలిపారు. మీ తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది మీ బ్లడ్,బ్రీడ్ అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X