మరోసారి రాజకీయాల్లో బిజీ కానున్న నాగబాబు.. జనసేన పార్టీ కోసం స్పెషల్ ప్లాన్!

నటుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న నాగబాబు టెలివిజన్ రంగంలో కూడా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన గతంలో జనసేన పార్టీ తరఫున ప్రచారాలు చేయడమే కాకుండా ఎన్నికల్లో పోటీ కూడా చేయడం జరిగింది. ప్రత్యర్థికి బలమైన పోటీని ఇచ్చినప్పటికీ కూడా అయినా గెలవలేకపోయారు. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఆయనకు మొదటి టార్గెట్ గా ఇటీవల జనసేన పార్టీ ఒక పర్యటనను అప్పజెప్పింది. ఇక నాగబాబు జనసేన కోసం ఏం చేయబోతున్నారు అని వివరాల్లోకి వెళితే..

 2019 ఎన్నికల్లో..

2019 ఎన్నికల్లో..

2019 జనరల్ ఎలక్షన్స్ లో నరసాపురం లోక్ సభ ఎంపీ స్థానానికి పోటీ చేసిన నాగబాబు తన ప్రత్యర్థికి గట్టిగానే పోటీని ఇచ్చారు. నాగబాబు ఇంకాస్త ముందుగా రాజకీయాల్లోకి వచ్చి ప్రచారంలో పాల్గొని ఉంటే తప్పకుండా గెలిచేవారు అని కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు వివరణ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నాగబాబుకు 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.

 పార్టీని బలోపేతం చేసేందుకు..

పార్టీని బలోపేతం చేసేందుకు..

ఇక చాలా రోజులుగా నాగబాబు జనసేన పార్టీ తరఫున పలు కార్యక్రమాల్లో కూడా రెగ్యులర్ గా పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో పీ.ఏ.సీ. సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన


ఇక నాగబాబు జూన్ 1 నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నట్లు పార్టీ అధిష్టానం తెలియజేసింది. జూన్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా, జూన్ 2 న విజయనగరం జిల్లా, జూన్ 3 న విశాఖపట్నం జిల్లాలోని పలు నియజకవర్గాల్లో నాగబాబు పార్టీ నాయకులతో పర్యటించనున్నారు. వారుసహ మూడు రోజుల జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉండనున్నారు.

పార్టీ నేతలతో చర్చలు

పార్టీ నేతలతో చర్చలు

ఇక ఆ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ చేయబోయే సక్షేమాల ఫురించి అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ గారి ఆలోచనా విధానం గురించి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీ శ్రేణులతో కూడా పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి నిర్దేశం చేస్తారు. ఇక పార్టీ ఎదుగుదలకు దోహద పడే అభిప్రాయాలు స్వీకరించనున్నారు.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
పార్టీలో కొత్త నాయకులు

పార్టీలో కొత్త నాయకులు


మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్న జనసేన పార్టీ సిద్ధాంతాలకు విధానాల పట్లకూడా చర్చలు జరుపనున్నారు. ఇక ఆ రూట్లో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నాయకులను కూడా పార్టీలోకి నాగబాబు ఆహ్వానించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న నాగబాబు గారికి ఘన స్వాగతం పలికేందుకు కొంతమంది పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X