twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబును అలా అనడం తప్పు.. అదో చేతకానితనం.. జగన్‌పై నాగబాబు కౌంటర్స్

    |

    Recommended Video

    :Nagababu Tweet On Chandrababu Naidu Went viral In Social Media | Filmibeat Telugu

    భారీ ఉత్కంఠ నడుమ ఇటీవల వచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ఈ ఫలితాలు చూసి ముక్కున వేలేసుకుంది. మరోవైపు జనసేన పరిస్థితి అంతకంటే దారుణం. ఈ రెండు పార్టీలను ఊడ్చేస్తూ భారీ మెజారిటీతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఏపీ ప్రజలు. ఈ ఫలితాలు చుసిన ప్రజానీకం, రాజకీయ పండితులు చంద్రబాబుపై ఓ రేంజ్ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌పై కౌంటర్స్ వేస్తూనే చంద్రబాబును సమర్థిస్తూ నాగబాబు పెట్టిన వరుస ట్వీట్స్ మరో సంచలనంగా మారాయి. ఆ వివరాలు చూద్దామా..

    జనసేనానికి అన్నీ తానై

    జనసేనానికి అన్నీ తానై

    నిజానికి జనసేన పవన్ కళ్యాణ్ స్థాపించిన పెద్ద దిక్కుగా అన్నీ తానై చూసుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. స్వయంగా తాను కూడా నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏదో సాధించేద్దాం అనుకున్నారు.. కానీ రిసల్ట్ చూసి కంగుతిన్నారు. మరోవైపు టీడీపీ కూడా ఇంచుమించుగా జనసేన లాగే భారీగా దెబ్బతింది.

    టీడీపీని అడ్డం పెట్టుకొని..

    టీడీపీని అడ్డం పెట్టుకొని..

    2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన నాగబాబు.. జనసేన పార్టీని సమర్ధించుకునే కోణంలో టీడీపీని, చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకొని తమ పార్టీని వెనకేసుకు రావడం చర్చనీయాంశం అయింది. నిజానికి ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ కంటే ఎక్కువగా టీడీపీనే విమర్శించిన నాగబాబు ఇలా యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

    చేతకానితనం అంటూ వరుస ట్వీట్స్

    ''చంద్రబాబు గారు మన ex సీఎం..ఇప్పుడు deafeat అయినంత మాత్రాన ఆయన్న దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించటం వేరు.ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం..ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి.అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక సాడిజం'' అని పేర్కొంటూ నాగబాబు చేసిన ట్వీట్‌లో ఏమర్థం దాగుందో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. అదేనండి పరోక్షంగా పవన్‌ని ఉద్దేశించడమే దాని లోలోపలి సారాంశం.

    జగన్ పై నాగబాబు కౌంటర్

    ''మనుషులు ప్రతి విషయంలో చాలా త్వరగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఏపీ కి జగన్ గారు సీఎం.అంటే జనానికి ప్రత్యర్థి పార్టీని అభిమానించే ప్రజలకు కూడా ఆయనే సిఎం. మన సీఎంకి కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ టైం ఇవ్వాలి..డోంట్ క్రిటిసైజ్ నౌ. అతనికి కనీసం శ్వాస తీసుకునే సమయమైనా ఇవ్వండి'' అని పేర్కొంటూ నాగబాబు మరో ట్వీట్ చేశారు. ఒకరకంగా ఇది జగన్ పై నాగబాబు వేసిన కౌంటర్ అని చెప్పుకోవచ్చు.

    జగన్ విజయం వెనుక.. పవన్ అపజయం వెనుక

    ''ప్రతి విజయం వెనుక ఒక అపజయం దాగుంటుంది.ప్రతి అపజయం వెనుక ఒక గొప్ప విజయం దాగుంటుంది'' అని చెబుతూ నాగబాబు మరో ట్వీట్ చేశారు. అంటే గతంలో ఒదిన జగన్ ఇప్పుడు గెలిచారు.. ఇప్పుడు ఓడిన జనసేన వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తుందనేది నాగబాబు ధీమా. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతున్నాయి.

     జనసేనానుల రియాక్షన్

    జనసేనానుల రియాక్షన్

    నాగబాబు చేసిన వరుస ట్వీట్స్ చూసి జనసేనానులు ఉప్పొంగిపోతున్నారు. ఇంతే ధీమాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయండి. విజయం మీదే.. అనే స్టైల్ లో కొందరి కామెంట్స్ చేస్తుండగా, మీకు సినిమాలే పక్కా.. రాజకీయం మీ డొక్క విరుస్తుంది అని మరికొందరు వాదిస్తున్నారు.

    English summary
    In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. And Janasena has huge loss from the people. Ysrcp got prestigious win. In this issue Konidela Nagendra Babu tweet and put sensetional commets on jagan mohan reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X