ఆందోళనలో మందు బాబులు... మెగా బ్రదర్ నాగబాబు సర్వే, జనం రియాక్షన్ ఇలా!
Recommended Video
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నట్లు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
ఇక పోతే ఎన్నికల ముందు జగన్ నవరత్నాల పేరుతో కొన్ని హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మద్యపాన నిషేధం కూడా ఉంది. అయితే ఇది అమలైతే తమ పరిస్థితి ఏమిటని మందు బాబులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరేమో మద్యపాన నిషేధం అమలు అసాధ్యమని అంటున్నారు.

ఆన్ లైన్ సర్వే నిర్వహించిన నాగబాబు
మద్యపాన నిషేధంపై రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు ఈ విషయంలో ఆన్ లైన్ సర్వే నిర్వహించారు. ‘వైఎస్ జగన్ నవరత్నాల్లో ముఖ్యమైన 'మద్యపాన నిషేధం' హామీ అమలు సాధ్యమేనా ?' అంటూ సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

జనం రియాక్షన్ ఇలా...
నాగబాబు నిర్వహించిన ఈ ఆన్ లైన్ సర్వేలో.... 85 శాతానికి పైగా జనం ‘సాధ్యం' అని సమాధానం ఇచ్చారు. మద్యపానం రద్దు చేస్తే ప్రభుత్వానికి చాలా నష్టం అని మరికొందరు అభిప్రాయ పడ్డారు. మద్య పానం నిషేధించడం వల్ల లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందని, నాటు సారా, గుడుంబా లాంటివి తయారు చేయడం మొదలవుతుందని, దీని వల్ల ప్రజలకు మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు.

జనసేన ఓటమిపై నాగబాబు
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక... రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన మెగాబ్రదర్ నాగబాబుకు సైతం ఓటమి తప్పలేదు. అయితే ఈ ఫలితాలపై నాగబాబు స్పందిస్తూ... ఇది ఓటమి కాదని, విరామం మాత్రమే అంటూ కొన్ని రోజుల క్రితమే ఓ వీడియో విడుదల చేశారు.

నాగబాబు
ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇకపై నుంచి రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. నాగబాబు కూడా తమ్ముడి దారిలోనే నడిచే అవకాశం ఉంది. ప్రజల సమస్యపై పోరాటం చేస్తూనే జబర్దస్త్ లాంటి షోలలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











