'ఇదొక వెర్రోడి వీరగాధ' షార్ట్ ఫిల్మ్: పతాక స్థాయికి నాగబాబు-బాలకృష్ణ వివాదం!
Recommended Video

బాలకృష్ణ, నాగబాబు మధ్య రగులుతున్న వివాదం పతాక స్థాయికి చేరింది. గతంలో పలు సందర్భాల్లో మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన కామెంట్లకు ఇపుడు కౌంటర్ ఎటాక్ ప్రారంభించిన నాగబాబు... ఆయన్న ప్రశ్నిస్తూ ఇప్పటికే పలు వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా బాలయ్య మీద నాగబాబు ఏకంగా ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల చేయడం సంచలనం అయింది. యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు 'నాగబాబు కౌంటర్ టు బాలకృష్ణ-వెర్రోడి వీరగాధ' అనే టైటిల్ పెట్టడం గమనార్హం. దీన్ని నాగబాబు స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు.

ఓపెనింగ్ షాట్లో లేడీస్ చితకబాదారు
షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ షాట్లోనే... కొందరు లేడీస్ ఓ వ్యక్తిని చితకబాదుతున్నట్లు చూపించారు. కార్లో వెళుతూ ఆ సీన్ చూసిన నాగబాబు అయ్యో పాపం అని జాలి పడి... మనకు ఎందుకులే అని వెళ్లిపోవడం కనిపించింది.

ఇంతకీ ఏం జరిగింది? అంటూ..
మరో చోట కూడా నాగబాబుకు ఇలాంటి సీనే కనిపించడంతో.... ఒక మగాడిని చితకబాదుతున్న లేడీస్‌ను అడ్డుకుని అసలు ఏం జరిగింది? ఒక వ్యక్తిని పట్టుకుని అందరూ ఎందుకు అలా చితకబాదుతున్నారు అంటూ అసలు విషయం ఆరా తీసినట్లు చూపించారు.

ఆడ పిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి...కడుపైనా చేయాలి
నిన్ను వాళ్లు ఎందుకు కొడుతున్నారు? అని ఆ వ్యక్తిని నాగబాబు ప్రశ్నించడం... ‘ఆడ పిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి...కడుపైనా చేయాలి' అనే పెద్దల మాటను ఫాలో అవుతున్నట్లు అతడు వెల్లడించడం గమనార్హం. దీంతో కోపంతో ఊగిపోయిన మెగా బ్రదర్ మీరు మంచి పనే చేస్తున్నారు, ఇంకా చితకబాదండి అంటూ అతడిని లేడీస్ గుంపుకు అప్పగించి వెళ్లిపోవడం చూపించారు.
ఈ వివాదం చివరకు ఎక్కడికి దారితీస్తుందో?
గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్లో చేసిన కామెంట్లపై నాగబాబు ఈ విధంగా సెటైర్ వేసినట్లు స్పష్టం అవుతోంది. నాగబాబు సృష్టించిన ఈ సునామీ చివరకు ఎక్కడికి వెళుతుంది? ఎలాంటి పరిణామాలకు దారిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











