పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూను గుర్తు చేస్తూ... నాగబాబు కౌంటర్!

Recommended Video

Mega Brother Nagababu Fires On A Tv Channel | Filmibeat Telugu

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఓ తెలుగు టీవీ ఛానల్లో ప్రసారం అయిన వార్తపై స్పందిస్తూ... తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్‌కు భజన చేస్తున్నట్లు ఉందంటూ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు రిలీజ్ చేసిన వీడియోతో ఆ ఛానల్ వారు హర్ట్ అయ్యారట. వెంటనే దాన్ని తొలగించాలని ఈ మెయిల్ పంపారట. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ కొడతామని హెచ్చరించారట.

ఈ విషయం వెల్లడిస్తూ ఆయన మరో వీడియో వదిలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం మీకే ఉంటుందా? ఒక పౌరుడిగా మాకు ఉండదా? మీరు ఏం తిట్టినా మేము భరించాలా? మేము ఓ మాట అంటే నొప్పి వచ్చిందా? అంటూ ఈ సందర్భంగా మెగాబ్రదర్ ప్రశ్నించారు.

మీకు అభ్యంతరం అయితే తీసేస్తాను

మీకు అభ్యంతరం అయితే తీసేస్తాను

మీ మీద ఓ చిన్న జోక్ వేసినా.. సెటైరిక్‌గా ఓ మాట అంటే తట్టుకోలేరా? లక్షా ముప్పైవేల మంది ఫాలోవర్స్ ఉన్న నా ఛానల్‌లో వారిని ఎంటర్టెన్ చేయడానికే ఈ వీడియో చేశాను. మీకు అభ్యంతరం అంటే తీసేస్తాను అని నాగబాబు తెలిపారు.

పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూను గుర్తు చేస్తూ

పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూను గుర్తు చేస్తూ

ఎవరో ఒక ఆడపిల్ల బూతు తిడితే అది బూతు కాదంటూ మా మీద పర్సనల్‌గా మీ నోటికొచ్చినట్లు మీరు మాట్లాడతారు. దాన్ని మాత్రం మేము క్వశ్చన్ చేయకూడదు. మీ గురించి మేము మాట్లాడితే ఇలా చేస్తారా? అంటూ.... గతంలో పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూను నాగబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఒక్క వీడియో ఆపితే నా జర్నీ ఆగదు

ఒక్క వీడియో ఆపితే నా జర్నీ ఆగదు

మీరు ఆ వీడియోను ఆపొచ్చు... కానీ నా ఎక్స్‌ప్రెషన్ ఎలా ఆపగలరు? మీ మీద చేయడానికి వంద ఉన్నాయి. ఒక్క వీడియో ఆపినంత మాత్రాన నా జర్నీ ఆగదని ఈ సందర్భంగా నాగబాబు తేల్చి చెప్పారు.

మా జీవితాలపై ఎన్నో చేశారు

మా జీవితాలపై ఎన్నో చేశారు

మీరు మా జీవితాలపై, మా వ్యక్తులపై, మా వ్యక్తిత్వాలపై ఎన్నో చేశారు. మీరు చేసిన ఒక వీడియోపై ఒక చిన్న సెటైర్ వేస్తే మీకు నొప్పి వచ్చిందా? అయినా ఒక్క వీడియో మీరు తీసేసినంత మాత్రాన మేమేమీ ఫీలైపోమని నాగబాబు తెలిపారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

ఇటీవల ఓ ఛానల్ వారు ప్రసారం చేసిన వీడియోలో... నారా లోకేష్ గురించి ప్రస్తావించారు. దావోస్ సమ్మిట్‌లో లోకేష్ అదరగొట్టారని, ఏపీకి రావాల్సిన ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ప్రధాని మోడీ గుజరాత్‌కు తరలించే ప్రయత్నాలు చేసినా అలా జరుగకుండా చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారని తెలిపారు. అయితే ఇది భజన వార్తలా ఉందని నాగబాబు సెటైర్ వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X