twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ తీరు తప్పబుడుతూ విమర్శలు!

    |

    మెగా బ్రదర్ నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో రెండు రోజుల క్రితం చేరడంతో పాటు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం సైతం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తన తమ్ముడి కోరికమేరకే తాను పార్టీలో చేరినట్లు, అతడి సూచన మేరకే ఎంపీగా పోటీ చేస్తున్నట్లు నాగబాబు స్పష్టం చేశారు.

    పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాల్లో కుటుంబ రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను విమర్శిస్తూ వచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలపై విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తతి ఇపుడు తన సోరుడికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

    ఇలా చేశారేంటి పవన్ సర్?

    ఇలా చేశారేంటి పవన్ సర్?

    ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ రాజకీయాలకు వ్యతిరేకం అని ప్రసంగాలు దంచారు. కానీ ఇప్పుడు అందరిలాగే మీరు కూడా కుటుంబ సభ్యులను పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు ఇస్తున్నారు, ఇలా చేస్తున్నారేంటి పవన్ సార్... అంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

    జగన్, లోకేష్‌ను ఎలా విమర్శిస్తారు?

    జగన్, లోకేష్‌ను ఎలా విమర్శిస్తారు?

    గతంలో పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలను విమర్శించారు. అప్పుడు అలా అన్న వ్యక్తే తన సోదరుడిని పార్టీలో చేర్చుకున్నారు. ఇకపై లోకేష్, జగన్ లాంటి వారిని పవన్ కళ్యాణ్ ఎలా విమర్శిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

    నేనేంటో చూపిస్తా, నాకే ఎక్కువ హక్కు ఉంది, నా తమ్ముడు పులి: నాగబాబునేనేంటో చూపిస్తా, నాకే ఎక్కువ హక్కు ఉంది, నా తమ్ముడు పులి: నాగబాబు

    భవిష్యత్తులో వారు కూడా వస్తారేమో...?

    భవిష్యత్తులో వారు కూడా వస్తారేమో...?

    ఇపుడు నాగబాబు పార్టీలోకి వచ్చారు... రేపు జనసేన పార్టీ ఎన్నికల్లో మంచి ఫలితలు సాధిస్తే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ లాంటి వారు కూడా పార్టీలోకి వస్తారేమో? అంటూ తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది.

    బయోడేటా ఫాం నింపకుండానే ఎంపీ టిక్కెట్ ఎలా ఇచ్చారు?

    బయోడేటా ఫాం నింపకుండానే ఎంపీ టిక్కెట్ ఎలా ఇచ్చారు?

    జనసేన నుంచి పోటీ చేయాలనుకున్న చాలా మంది ఆశావహులతో మీరు బయోడేటా ఫామ్స్ నింపించారు. కానీ మీ సోదరుడు నాగబాబును మాత్రం బయోడేటా ఫాం నింపకుండానే నేరుగా తీసుకున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ....మరికొందరు ప్రశ్నించే ప్రయత్నం చేశారు.

    అలాంటి వ్యక్తిని ఎలా తీసుకున్నారు?

    అలాంటి వ్యక్తిని ఎలా తీసుకున్నారు?

    2014లో మీరు ‘జనసేన' పార్టీ పెడుతుంటే నాగబాబు వ్యతిరేకించారు. అలాంటి వ్యక్తి ‘జనసేన'లోకి ఎలా వచ్చారు? వచ్చినా మీరెలా తీసుకున్నారంటూ.... కామెంట్స్ వెళ్లువెత్తుతున్నాయి.

    పీఆర్పీ 2 అవుతుందేమో?

    పీఆర్పీ 2 అవుతుందేమో?

    ఇపుడు నాగబాబు వచ్చారు, రేపు చిరంజీవి, అల్లు అరవింద్ కూడా వస్తే... ఈ పార్టీకి ‘జనసేన' అనే పేరు బదులు ‘పీఆర్పీ 2' అని పెడితే బావుంటుందంటూ... జనసేన పార్టీని వ్యతిరేకిస్తున్న వారు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

    English summary
    Janasena party president Pawan Kalyan, who has condemned dynasty politics, was trolled heavily on social media after getting his brother Nagababu join Jana Sena Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X