ఏక్ ప్రేక్షకుడు?

By Staff

Nagababu
నాగబాబు ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఏక్ పోలీస్ చిత్రం ఈ రోజు(శుక్రవారం)మార్నింగ్ షొ తో రిలీజైంది. సాధారణ ఓపినింగ్స్ తో మొదలయిన ఈ సినిమా మార్నింగ్ షో కే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ సినిమా పూర్తిగా చూసిన వాళ్ళకు ఏక్ ప్రేక్షకుడు అనే బిరుదు ఇవ్వాలనే కామెంట్స్ కూడా ధియేటర్స్ వద్ద వినపడుతున్నాయి.

కమర్షియల్ విలువలంటూ ఐటం సాంగ్ లు పెట్టినా వర్కవుట్ కాలేదని, నాసిరకం స్క్రీన్ ప్లే సినిమాను ఎనభైలనాటికి తీసుకుపోయిందని అంటున్నారు. ఇక కథలో సత్య మూర్తి(పృధ్వి) అనే లెక్చరర్ ఇద్దరు గూండాల చేతిలో చచ్చిపోతాడు. అయితే అది పెద్ద కేసు కాకుండా ఆ గూండాలు రాజకీయనాయకులను ఆశ్రయిస్తారు. అయితే ఈ హత్యకి సాక్ష్యమివ్వటానికి,కంప్లైంట్ ఇవ్వటానికి ఐదుగురు విధ్యార్ధులు ముందుకొస్తారు.వారికి మాధురి(హ్యాపీడేస్ గాయత్రి) నాయకత్వం వహిస్తూంటుంది.

నాగబాబు ఎ.సి.పి జయ చంద్రగా విభిన్నంగా కనిపించే ప్రయత్నం చేసారు.వారిని ఈ గూండాలు భయపెట్టే ప్రయత్నం చేస్తారు.ఈ లోగా అక్కడికి ఎ.సి.పి జయచంద్ర (నాగబాబు) ట్రాన్స్ ఫర్ అయి వస్తాడు. అయితే అతను కూడా విలన్స్ పక్షమే చేరి వారితో కలిసి మందు కొడుతూ ఎంజాయి చేస్తూంటాడు. అలాగే మాధురిని సైతం కిడ్నాప్ చేస్తాడు.అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాడనేది క్లైమాక్స్ లో ముడి విప్పుతాడు.

ఇక ఈ సినిమాతో నాగబాబు మరో ప్లాప్ ని తన కెరీర్ లో జత చేసుకున్నాడు. కోడి రామకృష్ణ గిన్నిస్ బుక్ రేస్ లో ఉన్నట్టున్నాడు కాబట్టి ఆయన సంగతి అస్సలు పట్టించుకోనవసం లేదు. అయితే నిర్మాత భాస్కర్ రెడ్డి మాత్ర వరసగా వివిధ హీరోలతో ఐదు సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ఆయనకే ఈ సినిమా అమ్ముకుని ఉండకపోతే నష్టం. అన్నిటికన్నా ముఖ్యంగా టిక్కెట్ రేటు గిట్టుబాటు గాని ప్రేక్షకుడే పాపం అనిపిస్తాడు.అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X