twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆంధ్ర, తెలంగాణలో ఏ బిడ్డ చనిపోయినా అవమానమే: నాగబాబు ఎమోషనల్ రిక్వెస్ట్

    |

    ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చోటు చేసుకోవడంతో మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. ఇలాంటి పరిస్థితులకు కారణం కొందరు తల్లిదండ్రుల ఆలోచన తీరు, విద్యాసంస్థల స్వార్థచింతనే అని మండి పడ్డారు.

    ''ఈ ఎగ్జామినేషన్, ఎడ్యుకేషన్ సిస్టం గురించి నాకు తెలియదు. కానీ చిన్న పిల్లలు అలా చనిపోతుంటే మనసుకు చాలా బాధేస్తుంది. చదువు అనేది కేవలం పుస్తకాల్లోనే ఉంటుంది, చదివితేనే గొప్పవాళ్లు అవ్వొచ్చు అనే సంకుచిత ఆలోచన నుంచి మొదట బయటకు రావాల్సింది తల్లిదండ్రులు, ఈ విద్యాసంస్థలే.'' అని నాగబాబు అన్నారు.

    అలాంటి చండాలమైన కండీషన్లోకి తీసుకెళ్లొద్దు

    అలాంటి చండాలమైన కండీషన్లోకి తీసుకెళ్లొద్దు

    ‘‘చదువులో పాస్ అవ్వడమే ఒక ధ్యేయంగా పిల్లలపై ఒత్తిడి పెంచడం, ఫెయిలైయినోడు ఎందుకూ పనికి రాడనే చండాలమైన కండీషన్లోకి వారిని తీసుకెళ్లడం, చదువులో టార్గెట్లు పెట్టడం, ఇన్ని మార్కులు తెచ్చుకోవాల్సిందే అని వారిని వేధించడం, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, పెద్ద టెక్నీషియన్ అవ్వాలనే మీ సొంత ఆలోచనలు వారిపై రుద్దడం సరికాదు.'' అని నాగబాబు అన్నారు.

    అలాంటి వారు ఉన్నంతకాలం పరిస్థితి మారదు

    అలాంటి వారు ఉన్నంతకాలం పరిస్థితి మారదు

    డాకర్టు, ఇంజనీర్లు తప్ప ఈ లోకంలో వేరే జాబ్స్ లేవా? వేరే పని చేసుకోకూడదా? మనం మనుషులం. బ్రతకడం అనేది అన్నింటికంటే ముఖ్యం. ఎలా బ్రతకాలనేది మన కంఫర్టు, కష్టం బట్టి ఉంటుంది. అంతే కానీ చదువే బ్రతకడానికి మూలం అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఈ సమాజం మారదని మెగాబ్రదర్ చెప్పుకొచ్చారు.

    ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు?

    ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు?

    కొందరు పెద్దల చండాలమైన, దరిద్రమైన ఆలోచన విధానం, పనికిమాలిన ఇన్‌సెక్యూరిటీ, పసిమొగ్గల్లాంటి వారి జీవితాల మీద పెట్టి తల్లిదండ్రులుగా మనమే వారిని చంపేస్తున్నాం. కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టం వచ్చిన తర్వాత పిల్లలను కూర్చోబెట్టి 18 గంటలు చదివిస్తున్నారు. వాడికి ఒక ఆటవిడపు, సరదా ఏమీ ఉండదా? మనం ఏమైనా బానిసత్వంలో బ్రతుకుతున్నామా? ఎందుకీ ఈ ప్రభుత్వాలు ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న సంస్థల మీద చర్యలు తీసుకోవడం కానీ, తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయడం చేయడం లేదు... అని నాగబాబు ప్రశ్నించారు.

    చదువుతావా? చస్తావా? అనే విధంగా పెంచొద్దు

    చదువుతావా? చస్తావా? అనే విధంగా పెంచొద్దు

    వారు బాగా చదువుకుంటానంటే చదివించండి... స్పోర్ట్స్, ఇతర రంగాల్లోకి వెళతానంటే ప్రోత్సహించండి. తల మీద గన్ను పెట్టి చదువు, నువ్వు చదివితేనే మనిషివి అన్నట్లు మాట్లాడటం సరికాదు. తప్పుడు పనులు చేయొద్దు, బాగా చదువుకో అని చెప్పొచ్చు. కానీ నువ్వు చదుతావా? చస్తావా? అనే విధంగా పెంచడం సరికాదు.

    మా నాన్న ఎప్పుడూ అలా చేయలేదు

    మా నాన్న ఎప్పుడూ అలా చేయలేదు

    ‘‘మా నాన్న మాపై ఎప్పుడూ చదవు గురించి ప్రెజర్ పెట్టలేదు. మా అమ్మ బాగా చదువుతున్నారా? అని అడుగుతుండేది. మాపై ఒత్తిడి లేదు కాబట్టే మా ఇష్టపూర్వకంగా నేను ఎల్ఎల్‌బి పూర్తి చేశాను, అన్నయ్య చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారు. మా చెల్లి ఒకరు ఎంబీబీఎస్, ఒకరు డిగ్రీ చేశారు. కళ్యాణ్ బాబు ఇంటర్మీడియట్ తర్వాత ఐటీ డిగ్రీ పొందాడు.'' అని నాగబాబు తెలిపారు.

    ఫెయిలైతే ఎక్కువ డబ్బులు ఇస్తా అనేవారు

    ఫెయిలైతే ఎక్కువ డబ్బులు ఇస్తా అనేవారు

    టెన్త్ క్లాసులో మా నాన్నతో లెక్కల పరీక్షలో ఫెయిలైతానేమో భయంగా ఉంది అంటే... ఒకటే చెప్పాడు. నువ్వు పాసైతే వంద రూపాయలు ఇస్తాను, ఫెయిలైతే ఐదువందలు ఇస్తాను అనేవాడు. అంటే టెన్షన్ పెట్టుకోకు, హ్యాపీగా ఉండు అని చెప్పడానికే అలా అనేవాడని నాగబాబు గుర్తు చేసుకున్నారు.

    ఆంధ్ర, తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ చనిపోయినా అందరికీ అవమానమే

    ఆంధ్ర, తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ చనిపోయినా అందరికీ అవమానమే

    అందరు తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఇలా చేస్తున్నారనడం లేదు. ఎవరైతే ఇలాంటి స్వార్థ చింతనతో వారిని చదువు యంత్రాల్లా మార్చి ఫెయిలైతే సూసైడ్ చేసుకుని చనిపోయేంత ప్రెషర్ పెడుతున్నారో వారి గురించే ఈ వీడియో చేశాను. ఆంధ్ర, తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ చనిపోయినా అందరికీ అవమానమే. మీ జీవితం మీది, మీ జీవితానికి నిర్ణేతలు మీరే. ఎలా ఉండాలంటే అలా ఉండండి, తప్పుడు దారికి వెళ్లకండీ, చెడు అలవాట్ల జోలికి పోకుండా ముందుకు సాగాలని చెప్పాలే తప్ప... వారిపై ఒత్తిడి పెట్టకూడదని నాగబాబు చెప్పుకచ్చారు.

    English summary
    Naga Babu Emotional Request To Students. NagaBabu says pressure from parents to perform well in exams can affect a child’s mental health. The solution lies in students, teachers, and parents - all 3 playing an active part in ensuring mental well-being. Finally, he says to ensure the holistic- physical, emotional and mental well-being of children, society must sincerely endeavor to bridge the gap in the education sector & mental well-being.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X