కళ్యాణ్ బాబును చూసి బాధపడ్డాం, వందేళ్లకు ఒకసారే ఇలా: నాగబాబు ఎమోషనల్
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ రాజకీయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తీరికలేకుండా జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం(మార్చి 14) రాజమహేంద్రవరంలో జరిగిన సభకు మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సోదరుడికి గురించి ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు.

ఈ రోజు పండగరోజే...
ఇంత వరకు కళ్యాణ్ బాబు ఏ మీటింగుకు డైరెక్టుగా హాజరు కాలేదు. ఒక్కసారైనా రావాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. నాకు లక్కీగా ఆవిర్భావం రోజు రాగలిగే సమయం, అవకాశం లభించింది. మా తమ్ముడిని ఇంత మంది అభిమానులు, జనసైనికుల మధ్యలో చూసుకుందామని వచ్చాను. జనసైనికులకు, కళ్యాణ్ బాబు అభిమానులకు, మంచి ప్రభుత్వం రావాలని కోరుకునే ప్రతి పౌరుడికి ఈ రోజు పండగ రోజే అని నాగబాబు తెలిపారు.

ఎందుకు ఇంత కష్టం అని బాధ పడ్డాం
తమ్ముడు ఫస్ట్ టైం ప్రత్యేకంగా పార్టీ పెట్టి వస్తుంటే చాలా బాధ పడ్డాం. ఎందుకొచ్చిన ఇబ్బంది ఇతడికి? హ్యాపీగా ఉండాల్సినోడు జనాల్లోకి వెళ్లి పార్టీ పెట్టి ఇంత కష్టం పడలా? అనిపించింది. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రజారాజ్యం సమయంలో మేము చూశాం కాబట్టి.. మా తమ్మడు కూడా ఇంత కష్టపడాలా? అని బాధ పడ్డామని నాగబాబు తెలిపారు.

నా నమ్మకం నిజమైంది
సంవత్సరం పాటు మేమంతా కళ్యాణ్ బాబు పార్టీని ఎంత వరకు లీడ్ చేయగలడో, రన్ చేయగలడో పరిశీలించాం. సంవత్సరం తర్వాత అర్థమైంది. తన 25 సంవత్సరాల విజన్ నెరవేర్చబోతున్నాడని అర్థమైంది. పార్టీ 2014లో పెట్టాడు. 2015లో నాకు నమ్మకం వచ్చింది. ఈ రోజు ఆ నమ్మకం నిజమైందని మెగాబ్రదర్ వ్యాఖ్యానించారు.

వందేళ్లకు ఒకసారే..
కళ్యాణ్ బాబు లాంటి మంచి లీడర్ వందేళ్లకు ఒకసారి వస్తాడు. ఇలాంటి లీడర్స్ అరుదుగా పుడతారు. ఇలాంటి వారి వల్లే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు అవినీతి ప్రభుత్వాలను చూశాం. కళ్యాణ్ బాబు ద్వారా త్వరలో మంచి ప్రభుత్వం రాబోతోందనే నమ్మకం ఉంది అన్నారు.

అన్నయ్య ఆశీర్వాదం ఉంది
చిరంజీవిగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కళ్యాణ్ బాబుకు ఉన్నాయి. తమ్ముడు విషయంలో అన్నయ్యగారు చాలా సంతోషంగా ఉన్నారు. మా తమ్ముడిని, మన అందరం అభిమానించే జనసేన నాయకుడిని ప్రజల మధ్యలో చూసుకోవడానికి హైదరాబాద్ నుంచి స్వయంగా వచ్చాను... అని నాగబాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











