For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీ నోటి దురుసేంటి, చిరంజీవి ఫోన్ చేసి అడిగారా.. బాలయ్యపై కొనసాగుతున్న నాగబాబు వార్!

  |
  Naga Babu Responds to Balakrishna Comments On Janasena Party | Filmibeat Telugu

  మెగా బ్రదర్ నాగబాబు సంచలనం కొనసాగుతూనే ఉంది. నందమూరి బాలకృష్ణపై వరుసగా విమర్శలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బాలయ్య గతంలో చిరు, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్లు ఇస్తున్నారు. బాలయ్య చేసిన ప్రతి కామెంట్ కు కౌంటర్ ఇవ్వాలని నాగబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే రోజుకు రెండు వీడియోల చొప్పున యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోల గురించి అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. గతంలో లేపాక్షి ఉత్సవాల సందర్భంగా బాలయ్య చిరుని ఉద్దేశించి చేసిన కామెంట్ కు నాగబాబు స్పందన ఇలా ఉంది.

   లేపాక్షి ఉత్సవాలు

  లేపాక్షి ఉత్సవాలు

  అనంతపురంలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలని బాలయ్య దగ్గరుండి జరిపించారు. ఆ సాయంలో మీడియా బాలయ్యని.. చిరంజీవిని ఆహ్వానించారా అని ప్రశ్నించగా.. నేనెవరినీ నెత్తిన పెట్టుకోను. మాకున్న గ్లామర్ చాలు. ఇంకొకరిని తీసుకొచ్చి నెత్తిన ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. బ్లడ్, బ్రీడ్ అప్పుడేమైంది అంటూ ఘాటుగా నాగబాబు!

   చిరంజీవి ఫోన్ చేసి అడిగారా

  చిరంజీవి ఫోన్ చేసి అడిగారా

  ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. తనని నెత్తిన పెట్టుకోమని చిరంజీవి మీకు ఫోన్ చేసి అడిగారా అని నాగబాబు ప్రశ్నించారు. మా మనుషులు కానీ, అభిమానులు కానీ అడిగారా అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా మాట్లాడడం ఏంటి.. మీ నోటి దురుసు ఏంటి.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తారా అంటూ బాలయ్య వ్యాఖ్యలని నాగబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

  మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

  చూద్దాం వచ్చే ఎలక్షన్స్‌లో

  చూద్దాం వచ్చే ఎలక్షన్స్‌లో

  మీకు గ్లామర్ ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి. నేను నెత్తిన పెట్టుకొను అంటూ డిక్టేటర్ లా మాట్లాడుతున్నారేంటి. ఒక ఎమ్మెల్యే గా ఉంది డిక్టేటర్ లా మాట్లాడుతున్నారు.. చూద్దాం వచ్చే ఎలక్షన్స్ లో ఏమవుతుందో.. అంతో నాగబాబు ఘాటుగా స్పందించారు. మా కుటుంబంలో అందరు చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ శాంతంగా ఉండే మనుషులు. వాళ్ళెవరూ ఇలాంటి విషయాల్లో మాట్లాడరు. అందుకే నేను మాట్లాడుతున్నా అని నాగబాబు అన్నారు.

  కంట్రోల్ తప్పుతూనే ఉన్నారు

  కంట్రోల్ తప్పుతూనే ఉన్నారు


  మీరు ఎన్ని కామెంట్స్ చేసినా తాము మాత్రం సంయమనం పాటిస్తూనే ఉన్నాం అని నాగబాబు అన్నారు. కానీ మీరు మాత్రం కంట్రోల్ తప్పుతూనే ఉన్నారు. మీ మనుషులు కూడా కంట్రోల్ లో లేరు. మీ వ్యక్తులు కొందరు మా వ్యక్తిగత జీవితాల జోలికి వస్తున్నారు. ఇది మంచిది కాదు అంటూ నాగబాబు బాలయ్యని హెచ్చరించారు.

  English summary
  Naga Babu Fires on Balakrishna Over Fourth Comment on Mega Family
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X