చంద్రబాబు కోసం కన్నీరు పెట్టుకున్న నాగబాబు.. ఇంకా ఎన్నిరోజులు ఇలా!

Recommended Video

Mega Brother Nagababu Comments On AP CM Chandrababu Naidu Going Viral | Filmibeat Telugu

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాజకీయ, సినిమా అంశాలపై నాగబాబు చేస్తున్న వీడియోలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని ఉద్దేశించి నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు కారణం అవుతున్నాయి. తాజాగా నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మొత్తం చంద్రబాబుపై నాగబాబు సరదాగా సెటైర్స్ వేస్తూ కనిపించారు.

మళ్ళీ బాబు రావాలి

మళ్ళీ బాబు రావాలి

తెలుగు దేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న కామెంట్స్ ని నాగబాబు ప్రస్తావించారు. మళ్ళీ బాబు రావాలి అంటున్నారు. అందరూ 60 ఏళ్ళు రాగానే రిటైర్మెంట్ తీసుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటారు. చంద్రబాబుకు 70 ఏళ్ళు. కానీ ఆయన్ని మాత్రం మళ్ళి బాబే రావాలి అంటూ ఎందుకు పని చేయించాలని అనుకుంటున్నారు. మీరు మాత్రం రిటైర్ అయి రెస్ట్ తీసుకోవాలి.. చంద్రబాబు మాత్రం విశ్రాంతి లేకుండా రాత్రి పగలు కష్టపడాలి. ఇదెక్కడి న్యాయం అంటూ నాగబాబు సెటైర్స్ వేశారు.

ఆయనకి మనవడు ఉన్నాడు

ఆయనకి మనవడు ఉన్నాడు

చంద్రబాబు గారికి ఓ మనవడు ఉన్నాడు. ఈ వయసులో మనవడితో ఆదుకోవాలని ఆయనకు ఉండదా. 70 ఏళ్ల వయసులో కూడా ఎందుకు ఆయన్ని ఇలా కష్టపెడతారు అని నాగబాబు ప్రశ్నించారు. ప్రజలకు చంద్రబాబుపై జాలి దయ లేవా అని నాగబాబు సెటైర్లు వేశారు. ఇప్పటికే చంద్రబాబులో ఓపిక నశించింది. నాన్నగారు 70 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్నారు అని లోకేష్ అన్నారు. ఒక కొడుకుగా లోకేష్బాధపడడంలో అర్థం ఉంది అని నాగబాబు అన్నారు.

మేం రెస్ట్ ఇస్తాం

మేం రెస్ట్ ఇస్తాం

ఈ సారి మేము మా చంద్రబాబు గారికి రెస్ట్ ఇచ్చి తీరుతాం. చంద్రబాబు తన మనవడితో హాయిగా ఆడుకునేలా చేస్తాం అని నాగబాబు అన్నారు. మేమంతా మా తాతల దగ్గర ఆడుకున్నాము. పాపం దేవాన్ష్ కూడా వాళ్ళ తాతతో ఆదుకోవాలి కదా. మళ్ళీ బాబు రావాలి అనేవారికి చెబుతున్నా.. మేము రానివ్వం ఆయన్ని.. రెస్ట్ ఇచ్చి తీరుతాం అని నాగబాబు అన్నారు.

కన్నీరు పెట్టుకున్న నాగబాబు

కన్నీరు పెట్టుకున్న నాగబాబు

చంద్రబాబు కష్టం చూసి బాధతో కడుపు చెరువైపోతోంది అంటూ కన్నీరు పెట్టుకున్నట్లు నాగబాబు సరదాగా కామెంట్స్ చేశారు. నా బాధ మీ కెవరికీ అర్థం కాదు అని అన్నారు. టిడిపికి వ్యతిరేకంగా వీడియోలు పెడుతూ వస్తున్న నాగబాబు తాజాగా ఈ ఫన్నీ వీడియోని రిలీజ్ చేశారు. గతంలో బాలకృష్ణని విమర్శిస్తూ చేసిన వీడియోలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X