మొత్తానికి పోస్ట్ డిలీట్.. నెటిజన్ల ట్రోలింగ్‌కు నాగబాబు వెనుకడుగు.. అసలు కథ ఏంటంటే?
ఒక్కోసారి సోషల్ మీడియాలో అనుకోకుండా తప్పులు జరుగుతుంటాయి. అవి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా నెటిజన్లు మాత్రం ఆ తప్పులు కొండంత చేసి చూపుతారు. ఇక ట్రోలింగ్ చేయడంలో నెటిజన్లు ఏ రేంజ్‌లో ముందుంటారో అందరికీ తెలిసిందే. నిన్న నాగబాబు చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలిసి చేశాడా? తెలియక చేశాడా? అన్నది తెలియ లేదు. కానీ నాగబాబును మాత్రం నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. అసలు జరిగిందేంటో ఓ సారి చూద్దాం.

సోషల్ మీడియాలో యాక్టివ్..
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ప్రతీ విషయంపై నాగబాబు తన గళాన్ని విప్పుతున్నాడు. అంతే కాకుండా సన్నిహితుల పుట్టిన రోజులకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ అందిస్తున్నాడు. సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు నాగబాబు విషెస్ చెబుతున్నాడు. తాను ఆప్తులు అని అనుకున్న వారికి కూడా విషెస్ చెబుతున్నాడు.

నిన్న అలా..
అయితే నిన్న (జనవరి 6) ఏఆర్ రెహ్మాన్ బర్త్ డే. ఈమేరకు స్వర మాంత్రికుడు రెహ్మాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన ఫోటోను షేర్ చేశాడు. నాగబాబు చెప్పిన విషెస్, షేర్ చేసిన ఫోటో బాగానే వైరల్ అయింది. అయితే అసలు కథ తరువాతే మొదలైంది.

కపిల్ దేవ్ బర్త్ డే..
ఏఆర్ రెహ్మాన్ బర్త్ డేనే కాకుండా నిన్న కపిల్ దేవ్ బర్త్ కూడా. కపిల్ దేవ్‌కు నాగబాబు బర్త్ డే విషెస్ తెలిపాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ కపిల్ దేవ్ ఫోటోను షేర్ చేయాల్సింది పోయి రణ్‌వీర్ సింగ్ ఫోటోను షేర్ చేశాడు. కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తోన్న 83 సినిమా పోస్టర్ నుంచి రణ్‌వీర్ సింగ్ స్టిల్‌ను షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు.

పొరబడి చేశాడా?..
అయితే నాగబాబు ఇలా కపిల్ దేవ్‌కు విషెస్ చెప్పడం బాగానే ఉన్నా కూడా ఫోటోను మార్చి పోస్ట్ చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. తెలిసి చేశాడా? లేక పొరబాటు పడ్డాడా? తెలియదు. కానీ నాగబాబు చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట్లో చర్చకు తెరలేపింది.

ట్రోలింగ్.. పోస్ట్ డిలీట్..
నాగబాబు షేర్ చేసిన కొద్ది క్షణాల్లో ఆ పోస్ట్ తెగ వైరల్ అయింది. అది కపిల్ దేవ్ కాదు.. రణ్ వీర్ సింగ్.. అది 83 సినిమా పోస్టర్.. ఇది కూడా తెలీదా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. కాసేపటి తరువాత నాగబాబు తన తప్పును తెలుసుకున్నట్టున్నాడు. వెంటనే పోస్ట్ డిలీట్ చేసి సైలెంట్‌గా ఉండిపోయాడు.


Click it and Unblock the Notifications











