మాల్దీవులకు వెళ్లే ముందు వచ్చాక కరోనా పరీక్షలు.. నిహారిక చైతన్యలపై నాగబాబు కామెంట్స్

మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం కరోనా కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లు కరోనా బారిన పడటం, ఉపాసన కూడా క్వారంటైన్‌కు పరిమితం కావడం, అల్లు శిరీష్ తన ఆరోగ్య చిట్కాలు చెప్పడం అందరికీ తెలిసిందే. మెగా ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల వల్లే ఈ కరోనా వ్యాపించిందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే క్రిస్మస్ వేడుకల అనంతరం నిహారిక, చైతన్యలు హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు చెక్కేశారు.

Recommended Video

#Nischay : Niharika And Chaithanya Visits Annavaram Temple | Filmibeat Telugu
 క్రిస్మస్ వేడుకలు ఘనంగా..

క్రిస్మస్ వేడుకలు ఘనంగా..

మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాసన రామ్ చరణ్ కలిసి నిర్వహించిన ఈ పార్టీలో మెగా అల్లు కజిన్స్ అందరూ పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌ మెగా ఇంట్లో కలకలం సృష్టించినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ ఈ ఈవెంట్‌ ద్వారా మెగా ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.

మెగా హీరోలు కరోనా బారిన..

మెగా హీరోలు కరోనా బారిన..

క్రిస్మస్ వేడుకలు ముగిసిన రెండు రోజుల తరువాత రామ్ చరణ్ కరోనా బారిన పడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ అని రామ్ చరణ్ ప్రకటించిన కొద్ది గంటలకే వరుణ్ తేజ్ సైతం తనకు పాజిటివ్ అని తెలిపాడు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆందోళనకు గురైంది.

ఉపాసన, అల్లు శిరీష్ అలా..

ఉపాసన, అల్లు శిరీష్ అలా..

రామ్ చరణ్‌కు పాజిటివ్ అని తేలడంతో ఉపాసనకు కూడా పాజిటివ్ వస్తుందని అంతా భావించారు. కానీ పరీక్షల్లో మాత్రం నెగెటివ్ అని వచ్చిందట. అల్లు శిరీష్ కూడా తనకు పాజిటివ్ వస్తుందని అనుకున్నాడట. కానీ రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తే.. రెండు సార్లూ నెగెటివ్ అని వచ్చిందట.

అందరి దృష్టి వారిపైనే..

అందరి దృష్టి వారిపైనే..

అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీలో కరోనా వైరస్ విజృంబిస్తుంటే.. నిహారిక, చైతన్యలు మాత్రం మాల్దీవుల్లో రచ్చ చేశారు. హనీ మూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంటకు కూడా కరోనా సోకి ఉంటుందని నెటిజన్లు భావించారు. తాజాగా వీటిపై నాగబాబు స్పందించాడు.

వెళ్లే ముందు వచ్చాక పరీక్షలు

వెళ్లే ముందు వచ్చాక పరీక్షలు

హనీమూన్ కోసం మాల్దీవుల‌కు వెళ్లే ముందు డిసెంబ‌ర్ 26వ తేదీన ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిహారిక‌, చైత‌న్య క‌రోనా పరీక్షలు చేయించుకున్నారని, అలాగే తిరిగి వచ్చేటప్పుడు డిసెంబ‌ర్ 29న ముంబై ఎయిర్ పోర్ట్‌లోనూ క‌రోనా టెస్టులు చేయించుకోగా నెగెటివ్ వచ్చినట్లు నాగబాబు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X