twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాతో ఆటలాడుతున్న మెగా బ్రదర్.. దేవుడు గొప్పా?.. ఆ వైరస్ గొప్పా..?.. భక్తులకు నాగబాబు చాలెంజ్!

    |

    కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. మానవాళిని అంతటి గడగడవణికిస్తోంది. అయితే కొందరు మాత్రం కరోనాతో పరాచకాలు కూడా ఆడుతున్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్ దాడి చివరకు హైద్రాబాద్‌లోకి ఎంటరైంది. హైద్రాబాద్‌లో పలు కరోనా కేసులు నిర్దారణ అవుతున్నాయంటూ వార్తలు గుప్పుమంటున్న వేళ సెలెబ్రిటీలు కరోనాపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. తమ బాధ్యతరాహిత్యాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఛార్మీ, వర్మ, నాగబాబు వంటి వారు కరోనాపై హాస్య ఛలోక్తులు విసురుతున్నారు.

    ఆల్ ది బెస్ట్..

    ఆల్ ది బెస్ట్..

    ఇటీవలే ఛార్మి సైతం కరోనా పై స్పందించి చివరకు సారీ చెప్పింది. కరోనా వచ్చింది.. ఆల్ ది బెస్ట్ అంటూ వీడియో పోస్ట్ చేసి ఛార్మి చిక్కుల్లో పడింది. చాలామంది ఛార్మి వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో చివరకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరింది ఛార్మి.

    కరోనాకే పాఠాలు..

    కరోనాకే పాఠాలు..

    ఏ విషయమైనా సరే తన స్టైల్లో స్పందించే వర్మ.. చివరకు కరోనాను కూడా వదిలిపెట్టలేదు. డియర్ వైరస్.. ఎవ్వరైనా చనిపోవాల్సిందే.. నీకు తెలియకుండా వైరాలజీ చదువుకో.. నువ్వు బతుకు అందరినీ బతకనివ్వు అంటూ ఓ సెటైర్ వేశాడు.

     నాగబాబు సైతం..

    నాగబాబు సైతం..

    ‘ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చనిపోతే.. ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయని అన్నారు. మానవుడు లేకుంటే మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయని చెప్పారు. సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయని, కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప' అని నాగబాబు ట్వీట్ చేశాడు.

    భక్తులకు ఛాలెంజ్

    భక్తులకు ఛాలెంజ్

    తాజాగా మళ్లీ స్పందిస్తూ..‘దేవుడి భక్తుల కి నా ఛాలెంజ్.. ఎక్కువ గా గ్రూప్స్ గా వుండొద్దు అని ప్రభుత్వం వారి సూచన.. సో మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మీ ప్రార్ధనాలయాలకి గ్రూప్స్ గా వెళ్లి పూజలు ,ప్రార్ధనలు చెయ్యండి.. ప్రసాదాలు, తీర్థాలు,స్వీకరించండి..సేఫ్‌గా ఉంటే దేవుడు గొప్ప తేడా అయితే కరోనా వైరస్ గొప్ప' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు.

    మెగాకోడలు బాధ్యతాయుతంగా..

    మెగాకోడలు బాధ్యతాయుతంగా..

    మెగా కోడలు మాత్రం కరోనా పట్ల తీసుకోవాల్సి జాగ్రత్తలు, సలహాలు, సూచనలు వివరించింది. కరోనాను ఎలా గుర్తించవచ్చు వ్యాధి లక్షణాలేంటనేవి చెప్పుకొచ్చింది. బయట తిరగొద్దని, కరచాలనం చేయోద్దని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది.

    English summary
    Naga Babu Interesting Tweet About Coronavirus. CoronaVirus entered in Hyderabad. Now mega brother Nagababu commented on this virus using social media platform.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X