పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ‘పవనిజం’ మొదలైంది
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అభిమానులు 'పవనిజం' కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 'పవనిజం' టైటిల్ తో ఓ చిత్రం మొదలైంది. ఈ చిత్రం లాంచింగ్ కార్యక్రకమానికి నాగబాబు ముఖ్య అతిధిగాహాజరయ్యి క్లాప్ కొట్టారు. పవన్ అభిమానులంతా ఈ చిత్రం చూస్తారనే నమ్మకంతో ఉన్నారు.
ధర్మశాస్త్ర ఫిలిమ్స్ పతాకంపై సుధీర్, మహి జంటగా రూపొందిస్తున్న 'పవనిజం' ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఇ.కె.చైతన్య దర్శకత్వంలో శ్యామ్‌శ్రీను ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నాగబాబు క్లాప్ ఇవ్వగా నాగరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. హరనాధరెడ్డి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ చిత్రానికి పేరుపెట్టిందే పవన్‌కళ్యాణ్ అభిమానులని, పవన్‌కళ్యాణ్ అభిమానులు తలుచుకుంటే సమాజాన్ని ఏ విధంగా మార్చగలరో చెబుతూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటూనే ఓ ప్రేమకథ కూడా సినిమాలో ఉంటుందని, సెప్టెంబర్ 2న తొలి టీజర్‌ను విడుదల చేస్తామని, మూడు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తిచేసి, డిసెంబర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. సమాజాన్ని మార్చడానికి అభిమానులు ఎలా పాటుపడతారో అన్న అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, 5 పాటలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని నిర్మాత షామ్ తెలిపారు.
అలాగే "పవనిజం అనే మాట ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టాం.మా కథకు యాప్ట్ టైటిల్. పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటే సమాజంలో ఎలాంటి మార్పులనైనా తీసుకుని రాగలరు అనేది ఈ సినిమా కథాంశం. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజున ఫస్ట్ టీజర్‌ను విడుదల చేస్తాం. మూడు షెడ్యూళ్లలో మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు. నిర్మాత శ్యామ్ మాట్లాడుతూ "వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. పవనిజం స్ఫూర్తితో ఈ కథను తెరకెక్కిస్తున్నాం'' అని తెలిపారు.
హీరో సుధీర్ మాట్లాడుతూ "సొసైటీని ఎలా బాగుచేయవచ్చో చెప్పే సినిమా ఇది'' అని అన్నారు. మంచి సినిమా అవుతుందని సింధు చెప్పారు. నాగబాబు, ఎమ్.ఎస్.నారాయణ, చంద్రమోహన్, సప్తగిరి, ఫణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: కనిష్క, కెమెరా: సతష్ ముత్యాల, ఆర్ట్: భాస్కర్‌రెడ్డి, స్టంట్స్: రాంబాబు.


Click it and Unblock the Notifications












