twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ లాస్: మెగాబ్రదర్ నాగబాబు ఇక పూర్తిగా దూరమేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి...అనే సామెత వినే ఉంటాం. ఈ సామెత మెగా బ్రదర్ నాగబాబుకు సరిగ్గా సరిపోతుందేమో? నిర్మాతగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన పలు విజయవంతమైన సినిమాలు తీసారు. మంచి అభిరుచిగల నిర్మాత అని పేరు తెచ్చుకున్నారు.

    రామ్ చరణ్ హీరోగా 'ఆరెంజ్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆయన....అది భారీ పరాజయం చవిచూడటంతో కావడంతో జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నారు. పవన్ కళ్యాణ్ ఆర్థికంగా సపోర్టు ఇవ్వడంతో నొప్పిని తట్టకోగలిగారు. దీని నుంచి నాగబాబు త్వరగానే కోలుకుంటారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా నాగబాబు మాటలు పరిశీలిస్తే....ఆయన సినీ నిర్మాణ రంగానికి దాదాపుగా దూరమైనట్లే అని స్పష్టం అవుతోంది.

    తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడారు. మళ్లీ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాలు నిర్మించేది ఎప్పుడు? అనే ప్రశ్నకు స్పందిస్తూ...'ఇప్పట్లో సినిమాలు నిర్మించే ఉద్దేశ్యం లేదు. ఇక సినిమాలు, సీరియల్లలో నటించడమే నా కర్తవ్యం' అని చెప్పుకొచ్చారు.

    ఆయన మాటలు బట్టి.....సినిమాల్లో నటించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్న నాగబాబు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించే స్థాయికి ఇప్పుడప్పుడే చేరుకోవడం అంత సులభం కాదనేది పలువురు విశ్లేషకుల అభిప్రాయం. వీలైనంత త్వరగా నాగబాబు ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకుని నిర్మాతగా పూర్వ వైభవాన్ని చాటుకోవాలని ఆకాంక్షిద్దాం.

    English summary
    'Orange' movie of Ram Charan in Bommarillu Bhaskar's direction was a known disaster. Naga Babu who produced the film lost everything.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X