For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పవన్ కళ్యాణ్‌తో జార్జ్ రెడ్డి.. అందుకే మా తమ్ముడంటే ఇష్టం.. సీఎం, పీఎం అయ్యే వ్యక్తి : నాగబాబు

|

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం జార్జ్ రెడ్డి. ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఎంతో రియలిస్టిక్‌గా ఉన్న విజువల్స్.. అన్ని ఎమోషన్స్‌ను కలగలపి చూపడం.. అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు తెరకెక్కించినట్టు కనిపించడంతో వైరల్‌గా మారింది. రోజు రోజుకు సినిమాపై హైప్ పెరుగుతూ వస్తోంది.

జార్జ్ రెడ్డిపై నాగబాబు ప్రశంసలు..

జార్జ్ రెడ్డిపై నాగబాబు ప్రశంసలు..

ట్రైలర్ ను చూసి టాలీవుడ్ ప్రముఖ నటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘జార్జ్ రెడ్డి' పేరు మీద విడుదల అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని చెబుతున్నారు. సీనియర్ నటుడు నాగబాబు ట్రైలర్ ను చూసి ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ.. తన యూ ట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సుదీర్ఘంగా మాట్లాడాడు.

పోస్టర్లు చూశాక..ట్రైలర్‌ను చూశా

పోస్టర్లు చూశాక..ట్రైలర్‌ను చూశా

నేను జార్జిరెడ్డి పోస్టర్లు చూసిన తర్వాత ట్రైలర్ ను చూశా. జార్జిరెడ్డి ఉస్మానియా విద్యార్థి అన్న విషయం తెలుసు. చాలా ఏళ్లుగా ఆయన గురించి వింటూనే ఉన్నా. ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి పాత్రకు పేరున్న నటుడు అంతగా సరిపోడని నాకు అనిపించింది. సందీప్ మాధవ్ ఇప్పటివరకు చిన్న పాత్రలే చేశాడు. అతను జార్జిరెడ్డి పాత్రకు సరిపోయాడు.

పవన్ కళ్యాణ్‌తో సినిమా..

పవన్ కళ్యాణ్‌తో సినిమా..

అతని పాత్రను మా కల్యాణ్ బాబు లేదా మా అబ్బాయి వరుణ్ తో చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. ఈలోగా జీవన్ రెడ్డి ఆ కథతో సినిమా తీసేశారని సంతోషించా. ఆయన కూడా నాకు పరిచయమే. జార్జిరెడ్డి ఒక లెజెండ్. అందుకే ఆయనంటే నాకు ఇష్టం. ఫిజిక్స్ , గణితంలో అతను గోల్డ్ మెడలిస్ట్. ఇస్రోలో ఉద్యోగం వస్తే వదిలేసి వచ్చాడు. పీడీఎస్‌యూ సంస్థను స్థాపించి.. విద్యార్థుల సమస్యల పరిష్కరించాడు. తోటీ విద్యార్థులకు తరగతులు చెప్పేవాడు.

రియల్ హీరో..

రియల్ హీరో..

ఆయన రియల్ లైఫ్ బాక్సర్.. బాక్సింగ్‌లో చాంపియన్.. ఓ ఇరవై ముప్పై మంది వచ్చినా కొట్టగలడు. రియల్ హీరో. అనేక రకాల విద్యల్లో ప్రావీణ్యం ఉంది. అరణ్యంలోకి వెళ్లినా బతికే సత్తా ఉంది. కానీ ప్రజల్లోనే ఉండి సేవ చేయాలని అనుకున్నాడు. విద్యార్థుల కోసం.. వెనుకబడిన వర్గాల కోసం ఎన్నో రకాలుగా పోరాడాడు.

అప్పుడు నేను పదో తరగతి..

అప్పుడు నేను పదో తరగతి..

ఆయన చనిపోయినప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను.. నేను డిగ్రీకి వచ్చేసరికి నాకు ఆయన గురించి తెలిసింది. అప్పట్లో ఉన్న విలువలు.. ఇప్పుడున్న యూత్‌కు లేవు.. అవి తిరిగి నేర్చుకోవాలి. జనాలు తెలుసుకోవాలి. అందుకే ఈ సినిమాను చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను.

అందుకే మా తమ్ముడు ఇష్టం..

అందుకే మా తమ్ముడు ఇష్టం..

ఆయన్ను చూస్తుంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు..ఆయన వ్యక్తిత్వం, అగ్రెసివ్‌నెస్ , ఎమోషన్స్.. పవన్‌లో కనిపిస్తాయి.. అందుకే మా తమ్ముడంటే నాకిష్టం. జనసేన జెండాలో కూడా ఆయన మూసిన గుప్పిటి గుర్తు ఉంటుంది.. అందుకే అంటారేమో గొప్పవాళ్లందరూ ఒకేలా ఆలోచిస్తారు అని. ఇక్కడ మా తమ్ముడిని హైలెట్ చేయడం అని కాదు.. కానీ ఒక ఉదాహరణగా చెప్పాను.

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
సీఎం, పీఎం కాగల వ్యక్తి..

సీఎం, పీఎం కాగల వ్యక్తి..

ఎంతో మంది కోసం యుద్దం చేసిన వ్యక్తి.. 25 కత్తిపోట్లు తిని కూడా.. తప్పించుకుని.. బాగయ్యాక మళ్లీ వచ్చి పోరాడాడు. ఆఖరికి కొన్ని శక్తులు మట్టుబెట్టాయి. ఒకవేళ ఆయన బతికి ఉంటే.. సీఎం, పీఎం అయ్యే గొప్ప లక్షణాలున్న వ్యక్తి. ఇలాంటి లెజెండ్ గురించి సినిమా తీయాలి. ఇది బయోపిక్ అంటే.. ఇలాంటి చిత్రాలను బయోపిక్ అంటారు.

English summary
Naga Babu Made Sensational Comments On George Reddy. This Movie Is Based On Osmania Student George Reddy Life. Which Is Directed By Jeevan reddy. Buzz Is That Pawan Kalyan May Attend George Reddy pre Relaese Event.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more