twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ నిర్మాతగా మారుతున్న నాగబాబు.. ఈసారి ఆరెంజ్ లా కాకుండా...

    |

    మెగా బ్రదర్ నాగబాబు మొదట హీరోగా అడుగులు వేసి ఆ తర్వాత మళ్ళీ నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తో నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలు అప్పట్లో నాగబాబుకు మంచి లాభాలను అందించాయి. అయితే ఆ తర్వాత మెగా హీరోలతో చేసిన సినిమాలు ఊహించని విధంగా దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా ఆరెంజ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    ఆ ఒక్క సినిమాతో అప్పటివరకూ సంపాదించుకున్న ఆస్తులు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు పవన్ కళ్యాణ్ సహాయం కూడా చేశాడు. ఆరెంజ్ సినిమా తర్వాత మళ్లీ అటు వైపు వెళ్ళకూడదు అని అనుకున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.

    naga babu once again re start his production house with varun tej movie,

    ఇక ఆయన టెలివిజన్ రంగంలో అలాగే నటుడిగా కొనసాగుతూ మంచి ఆదాయాన్ని అందుకున్నారు. మరొకవైపు వరుణ్ తేజ్ కూడా స్టార్ హీరోగా భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిర్మాతగా ఆయన అంజన ప్రొడక్షన్స్ ను రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ ఇచ్చిన క్లారిటీతో నాగబాబు మళ్లీ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. వరుణ్ తేజ తన తదుపరి సినిమా ను టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలియజేశాడు.

    యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పవర్ఫుల్ హీరో గా కనిపించబోతున్నాడట. అయితే ఈ సినిమా నాగబాబు తో పాటు బివిఎస్ఎన్ ప్రసాద్ కూడా సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది వరకే ఈ నిర్మాతతో వరుణ్ తేజ్ తొలి ప్రేమ అనే సినిమా చేసే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా కథ విషయంలో నాగబాబు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరెంజ్ తరహాలో కాకుండా ఈ సినిమా కమర్షియల్ అంశాలతో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అలాగే సరికొత్త కంటెంట్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నాగబాబు ఎలాంటి లాభాలను అందుకుంటాడో చూడాలి.

    English summary
    naga babu once again re start his production house with varun tej movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X